బర్త్ డే రోజు దుబాయ్ తీసుకెళ్లలేదని దారుణం.. భర్తను ముక్కుపై గుద్ది చంపిన భార్య..

By Asianet News  |  First Published Nov 25, 2023, 2:00 PM IST

వెడ్డింగ్ యానివర్సరీకి, బర్త్ డేకు ఖరీదైన బహుమతులు ఇవ్వకపోడం, పుట్టిన రోజున దుబాయ్ వెళ్లనివ్వకపోవడం వంటి కారణాలతో ఆ భార్య భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో భార్య.. భర్తను ముక్కుపై గుద్దడంతో అతడు మరణించాడు. 


ఓ భార్య భర్తపై దారుణానికి ఒడిగట్టింది. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లేందుకు ఒప్పుకోలేదని భర్త ముక్కుపై గుద్దింది. దీంతో అతడు మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో కలకలం రేకెత్తించింది. పోలీసులు, ‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పుణెలోని వనవ్డి ప్రాంతంలో  పోష్ రెసిడెన్షియల్ సొసైటీలో నిఖిల్ ఖన్నా  (36) అనే నిర్మాణ రంగ వ్యాపారవేత్త తన భార్య రేణుకతో కలిసి జీవిస్తున్నారు.

tunnel collapse : ఉత్తరకాశీలో కుప్పకూలిన టన్నెల్ : రెస్యూ పనులకు మళ్లీ అడ్డంకి.. ఇప్పుడేం చేయబోతున్నారంటే ?

Latest Videos

వీరిద్దరూ ఆరేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఈ దంపతుల మధ్య గొడవ జరిగింది. రేణుక బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం నిఖిల్ దుబాయ్ తీసుకెళ్లలేదు. అలాగే ఆమె బర్త్ డేకు, వెడ్డింగ్ యానివర్సరీకి ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వలేదు. ఈ విషయంలో భార్య భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే బంధువుల పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు రేణుక ఢిల్లీ వెళ్లాలనుకుంది. దీనికి కూడా ఖన్నా సానుకూలంగా స్పందించకపోవడంపై రేణుక ఆగ్రహం వ్యక్తం చేశారు.

KCR: 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఆత్మహత్యలు, వలస‌ల‌తో నిండిపోయింది.. కేసీఆర్ ఫైర్

ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం ఎక్కువైంది. ఈ క్రమంలో కోపంతో రేణుక నిఖిల్ ముఖంపై గుద్దింది. ఆ పంచ్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే నిఖిల్ ముక్కు, కొన్ని దంతాలు విరిగిపోయాయి. అనంతరం తీవ్ర రక్తస్రావంతో నిఖిల్ స్పృహ కోల్పోయాడు. తరువాత మరణించాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రేణుకపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

click me!