ఉత్తరకాశీలో కుప్పకూలిన టన్నెల్ లో 41 మంది కార్మికులు బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. వారిని కాపాడేందుకు రెస్యూ ఆపరేషన్ లు కొనసాగుతున్నా.. తరచూ అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా మరో అడ్డంకి ఎదురైంది. దీంతో కార్మికులను రక్షించేందుకు మరో వ్యూహాన్ని అమలు చేయనున్నారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కుప్పకూలి 13 రోజులు దాటింది. అయితే సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే తరచూ అడ్డంకులు ఏర్పడుతుండటంతో కార్మికులు ఇంకా అందులోనే బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్నారు.
ప్రపంచంలోని హిందువులంతా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వాలి - ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
శుక్రవారం సాయంత్రం కూడా అమెరికాకు చెందిన డ్రిల్లింగ్ యంత్రంతో రెస్యూ పనులు చేపట్టారు. అయితే ఆ యంత్రం మెటల్ గర్డర్ ను ఢీకొట్టడంతో సహాయక చర్యలకు అతిపెద్ద అడ్డంకి ఎదురైంది. దీంతో డ్రిల్లింగ్ నిలిచిపోవడంతో ఆపరేషన్ నిలిపివేశారు. ఇప్పుడు వర్టికల్ డ్రిల్లింగ్ ఆప్షన్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
సహాయక చర్యల్లో పాల్గొంటున్న ప్రభుత్వ సంస్థలు వర్టికల్ డ్రిల్లింగ్ కు సన్నాహాలు ప్రారంభించాయి. డ్రిల్లింగ్ కు ఉపయోగించే యంత్రాన్ని పూర్తిగా అమర్చి అమర్చేందుకు సిద్ధంగా ఉంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) ఇప్పటికే వర్టికల్ డ్రిల్లింగ్ సైట్ కు చేరుకోవడానికి రహదారిని సిద్ధం చేసిందని, ప్లాట్ ఫారమ్ ను బలోపేతం చేసేందుకు త్వరలోనే సరుకులను రవాణా చేస్తామని తెలిపారు.
ఇదిలా ఉండగా.. శుక్రవారం సిల్కియారా టన్నెల్ స్థలాన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రెస్క్యూ ఆపరేషన్ తుది దశలో ఉందని, చిక్కుకున్న 41 మందిని బయటకు తీయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని హామీ ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే సమయంపై ఊహాగానాలు చేయవద్దని ఎన్డీఎంఏ అధికారి లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ ఆటా హస్నైన్ (రిటైర్డ్) మీడియాకు సూచించారని ‘ఇండియా టుడే’ పేర్కొంది.
భళా కంబళ.. తొలిసారిగా బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్ లో నిర్వహణ.. ఏమిటీ పోటీలు.. ? (ఫొటోలు)
కాగా.. గత మూడు రోజులుగా ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కు అనేక ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బుధవారం కొన్ని ఇనుప నిర్మాణాలను ఆగర్ యంత్రం ఢీకొనడంతో డ్రిల్లింగ్ నిలిపివేశారు. కొన్ని గంటల ఆలస్యం తర్వాత గురువారం రెస్క్యూ ఆపరేషన్ పునఃప్రారంభమైంది.