ఏళ్ల తరబడి భర్తను వేధింపులకు గురి చేస్తున్న భార్యపై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ భార్యా బాధితుడికి కోర్టు అండగా నిలిచింది. అంతకు ముందు ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
వారిద్దరూ భార్యాభర్తలు. మనస్పర్థలు, కుటుంబ కలహాల వల్ల వారిద్దరూ 2005లోనే విడిపోయారు. అయినా ఆ భార్య తన భర్తను వేధింపులకు గురి చేయడం మానలేదు. పదే పదే అతడిపై క్రిమినల్ కేసులు దాఖలు చేసింది. దీంతో అతడు తీవ్ర మానసిక వేధనకు గురయ్యాడు. అయితే అతడికి ఢిల్లీ హైకోర్టు అండగా నిలిచింది. భార్య తీరును తప్పుబట్టింది. అతడికి ఉపషమనం అందించింది.
వివరాలు ఇలా ఉన్నాయి. ఓ జంట మధ్య మనస్పర్థలు వచ్చి 2005లో విడిపోయింది. అయితే భార్య.. తన భర్తపై పదే పదే క్రిమినల్ కేసులు దాఖలు చేసింది. దీంతో కలహాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఆ దంపతులు మళ్లీ కలవలేకపోయారు. అందుకే ఓ ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. అయినా ఆ భార్య అతడిని వేధించడం ఆపలేదు. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ఆమె ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది.
తన భర్త వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని అందులో ఆమె పేర్కొంది. తాను అతడిని వేధింపులకు గురి చేస్తున్నాను అనడంలో నిజం లేదని తెలిపింది. కాబట్టి తమకు ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ను కోర్టు విచారించింది. ఆమె అభ్యర్థనను కొట్టి వేసింది. ఈ కేసులో ఈ నెల 13వ తేదీన తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా భార్య తీరుపై ఘాటుగా వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ పాఠశాల పిల్లలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. దసరా నుంచి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్
ఏళ్ల తరబడి భార్యభర్తలు వేరుగా ఉండి, విడాకుల అంశం కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో భర్త వేరే స్త్రీతో సన్నిహితంగా ఉన్నందుకు డివోర్స్ ను రద్దు చేయాలని కోరిన ఆ భార్య అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. భర్తతో, తన అత్తగారింటిపై ఆమె గౌరవం చూపలేదని పేర్కొంది. తరచూ భర్తపై క్రిమినల్ కేసులు పెడుతూ అతడికి మనశ్శాంతిని దూరం చేసిందని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందుకే భర్త మరో స్త్రీతో సన్నిహితంగా ఉండి, ఈ ఒత్తిడి నుంచి కొంత ఉపషమనం పొంది ఉండవచ్చని తెలిపింది. అయినప్పటికీ ఆ పరిణామం విడాకుల అంశం కోర్టుకు వచ్చిన తరువాత జరిగింది కాబట్టి.. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను రద్దు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. భార్య క్రూర ప్రవర్తన వల్ల ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే అని పేర్కొంది. కాగా.. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని రుజువు చేసే సాక్షాలు కూడా ఈ కేసులో లేవని కోర్టు తెలిపింది.