LPG Cylinder: గుడ్ న్యూస్.. ఇక రూ.450 కే గ్యాస్ సిలిండర్ ..! 

Published : Sep 16, 2023, 06:37 AM IST
LPG Cylinder: గుడ్ న్యూస్.. ఇక రూ.450 కే గ్యాస్ సిలిండర్ ..! 

సారాంశం

LPG Cylinder: వంట గ్యాస్‌ వినియోగదారులకు మధ్యప్రదేశ్ లోని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వంట గ్యాస్‌ సిలిండర్‌ను కేవలం రూ.450 కే అందించనున్నట్లు ప్రకటించింది. మొత్తం గ్యాస్ సిలిండర్ ఖర్చులో రూ.450 వినియోగదారులు చెల్లిస్తే మిగితా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 

LPG Cylinder: ఎన్నికల ముందు ఓటరు దేవుళ్లను ప్రత్యేక్షం చేసుకోవడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని  విధంగా .. ప్రతిపక్షాలు కూడా షాక్ అయ్యేలా.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ను కేవలం రూ.450 కే అందించనున్నారు.  కేవలం రూ. 450 కే గ్యాస్ సిలిండర్ అంటే నమ్మబుద్ది కావడం లేదుగా. కానీ ఇదే వాస్తవం.. 

తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం 'సిలిండర్ రీఫిల్లింగ్ స్కీమ్'ని ప్రకటించింది.  ఈ పథకం కింద ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ముఖ్యమంత్రి లాడ్లీ బహనా యోజన లబ్ధిదారులందరికీ సెప్టెంబర్ 1 నుండి రూ.450 కే గ్యాస్ సిలిండర్‌ను పొందవచ్చని తెలిపింది. రాష్ట్రంలోని టికామ్‌గఢ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  ప్రసంగిస్తూ ఈ కీలక పథకాన్ని ప్రకటించారు.

పథకం గురించి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన ట్విట్టర్ ఖాతాలో.."నా ప్రియమైన సోదరీమణులారా.. ఇప్పుడు మీకు రూ. 450కి ఎల్‌పిజి సిలిండర్ లభిస్తుంది. మీరు నా కుటుంబం, మీ జీవితాన్ని సులభతరం చేయడానికి నేను పగలు రాత్రి శ్రమిస్తాను" అని రాశారు. "నేను ఈ రోజు రూ. 450కి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించాను. రూ. 268 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల భూమి పూజను నిర్వహించాను" అని ఆయన తెలిపారు.

మధ్యప్రదేశ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా స్కీమ్, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులైన ప్రతి మహిళ గ్యాస్ కనెక్షన్ ID, సమగ్ర ID వంటి వివరాలను రుజువు చేస్తూ ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అర్హులైన వారు ఈ పథకం ద్వారా రూ.450 కే గ్యాస్ సిలిండర్‌ను పొందవచ్చు. 

సబ్సిడీ ఎలా వర్తిస్తుంది?

లబ్ధిదారులు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌ను మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సిఉంటుంది.  అందులో  రూ. రూ.450 మినహాయించి మిగితా సొమ్మును ఆ లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం  జమ చేస్తుంది.  అయితే, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన విషయంలో, ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని చమురు కంపెనీలకు బదిలీ చేస్తుంది. ఆ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేస్తుంది. ఈ తగ్గింపు మొత్తాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించింది. ఇక మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ధర పెరగడం, తగ్గడం వంటివి జరిగితే వాటికి అనుగుణంగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు పేర్కొంది.

ఇటీవలె వంట గ్యాస్ సిలిండర్‌‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వంట గ్యాస్ పై రూ.200 సబ్సిడీ ప్రకటించింది. దీంతో తోడు ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ది దారులను మరో రూ.200 అదనపు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందించనున్నది. ఈ నిర్ణయంతో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులు ఒక్కో సిలిండర్‌పై రూ.400 సబ్సిడీ లభిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. 450 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించడం గమనార్హం.
 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?