'రామచరితమానస్ ఓ సైనైడ్..' బీహార్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలు

By Rajesh Karampoori  |  First Published Sep 16, 2023, 5:47 AM IST

బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామచరితమానస్‌ను సైనైడ్‌తో పోల్చి కలకలం రేపారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.   


బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామచరితమానస్ అనే మత గ్రంథంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్‌చరిత్‌మానస్‌లో పేర్కొన్న కొన్ని కంటెంట్ పొటాషియం సైనైడ్‌తో సమానమని మంత్రి చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. పొటాషియం సైనైడ్‌ ఉన్నంత వరకు నిరసన తెలుపుతామన్నారు. ఈ ప్రకటనపై కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం చంద్రశేఖర్‌పై విరుచుకుపడ్డారు.

ఆచార్య ప్రమోద్ కృష్ణం.. సోషల్ మీడియా సైట్ 'X' లో పోస్ట్ చేస్తూ.. తన ప్రకటనకు సంబంధించి బీహార్ విద్యా మంత్రిని టార్గెట్ చేశారు. శ్రీ రామచరితమానస్‌ను పొటాషియం సైనైట్ అని పిలిచిన బీహార్ మంత్రి తన పేరును చిర్కుట్ శేఖర్‌గా మార్చుకోవాలని పోస్ట్‌లో రాశారు. ఇంతకు ముందు కూడా ఆచార్య ప్రమోద్ కృష్ణం సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిరంతరం పోస్ట్‌లు చేస్తూనే ఉన్నారు.
 
అసలేం జరిగిందంటే.. 

Latest Videos

హిందీ దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి  చంద్రశేఖర్‌ ప్రసంగించారు. ‘‘సైనైడ్ కలిపిన ఆహార పదార్థాలను వడ్డిస్తే మీరు తింటారా? హిందూ మత గ్రంథాల విషయం కూడా ఇంతే.. రామచరితమానస్ గ్రంథం విషయంలో నా అభిప్రాయం అలాంటిదే..  నా అభిప్రాయం స్థిరం, నా జీవితాంతం అవి నిలిచి ఉంటాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా వీటిపై వ్యాఖ్యానించారు. మురుగులో దిగేవారి కులం మారేవరకూ దేశంలో రిజర్వేషన్లు, కులగణన అవసరం ఉండి తీరుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు కూడా రామచరితమానస్ విషయంలో విద్యాశాఖ మంత్రి అభ్యంతరకర ప్రకటనలు చేయడం గమనార్హం.

విద్యాశాఖ మంత్రికి జేడీయూ సలహా 

దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి ప్రకటనపై బీహార్ మహాకూటమిలో మిత్రపక్షమైన జేడీయూ తీవ్రంగా స్పందించింది. రామ్‌చరిత్‌మానస్‌లో పొటాషియం సైనైడ్‌ను చూసే వారు తమ భావజాలాన్ని తమలో తాము ఉంచుకోవాలని, దానిని పార్టీ లేదా భారత కూటమిపై రుద్దడానికి ప్రయత్నించవద్దని జేడీయూ అధికార ప్రతినిధి అభిషేక్ ఝా అన్నారు. మేము అన్ని మతాలను, వారి మత గ్రంథాలను గౌరవిస్తున్నామని, మీడియాలో ఉండేందుకు కొందరు ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. 

'ఆర్జేడీ ఓ సైనైడ్ పార్టీ'

అదే సమయంలో విద్యా మంత్రి ప్రకటనపై బిజెపి కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. సనాతన్‌తో తమకు చాలా ఇబ్బంది ఉంటే మతం మారాలని అన్నారు. విద్యాశాఖ మంత్రి రామచరిత్మానస్‌లో పొటాషియం సైనైడ్‌ను చూస్తున్నారని, వాస్తవానికి  ఆర్జేడీ వంటి పార్టీలు బీహార్ రాజకీయాలకు పొటాషియం సైనైడ్ లాంటివని బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ కుమార్ సింగ్ విమర్శించారు.
 

click me!