
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో అధికార బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి జయనారాయణ వ్యాస్ వ్యక్తిగత కారణాల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా విషయంలో గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌కు లేఖ రాశారు. అందులో ‘ గత మూడు దశాబ్దాలుగా బీజేపీకి చురుగ్గా నేను సేవలందించాను. పార్టీ సిద్ధాంతాల ప్రకారం పని చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ’ అని పేర్కొన్నారు.
ఘోరం.. చేతబడి చేసిందనే నెపంతో 45 ఏళ్ల మహిళ సజీవ దహనం
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ కు ఉన్నప్పుడు.. జయనారాయణ వ్యాస్ బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన సిద్దాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2012,2017 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా.. ఆయన తన పాత పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. జయనారాయణ వ్యాస్ ఇటీవల కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.
అలాగే గుజరాత్ ఎన్నికలకు కాంగ్రెస్ తరుఫున పరిశీలకుడిగా ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను ఆయన గత వారం అహ్మదాబాద్‌లో కలిశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ గుజరాత్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ నిర్మాణానికి సహకరించిన వ్యాస్‌ను ఆ పార్టీ విస్మరిస్తోందని తెలిపారు. అందుకే ఆయనను ఇటీవల సోనియా గాంధీ, గెహ్లాట్, గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రఘు శర్మలను కలిశారని పేర్కొన్నారు.
ఉగ్రవాద నిధుల కేసు.. దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ
అయితే జయనారాయణ వ్యాస్ రాసిన రాజీనామా లేఖ తనకు అందిందని, దానిని పార్టీ ఆమోదించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాటిల్ తెలిపారు. ‘‘ పదే పదే ఓడిపోయినా మేం ఆయనకు చాలాసార్లు టిక్కెట్లు ఇచ్చాం. 75 ఏళ్లు దాటిన వారికి టిక్కెట్ ఇవ్వకూడదని పార్టీ నిబంధన పెట్టింది. ఎన్నికల అభ్యర్థిత్వాన్ని ధృష్టిలో ఉంచుకొని ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకుని ఉండొచ్చు ’’ అని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి కూడా ఊహించని పరిణామం ఎదురైంది. ఆ పార్టీ సీనియర్ నేత హిమాన్షు వ్యాస్ శనివారం బీజేపీలో చేరారు. ఆయన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ చేరిక సందర్భంగా హిమాన్షు మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేసే వారిని నాయకులు విస్మరించారని ఆరోపించారు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేయడానికి ఆ పార్టీ నాయకత్వమే కారణమని అన్నారు.
సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్.. డాక్టర్ అనహిత పండోల్‌పై ఎఫ్ఐఆర్
కాంగ్రెస్ నాయకత్వం ప్రజలతో, పార్టీ కార్యకర్తలతో సంభాషించడంలో కూడా విఫలమైందని హిమాన్షు వ్యాస్ అన్నారు. నిజమైన కార్యకర్తలను నాయకత్వానికి చేరుకోవడానికి కూడా అనుమతి లభించడం లేదని అన్నారు. కాగా.. ఆయన రాష్ట్రంలోని సురేంద్రనగర్ జిల్లాలోని వాధ్వన్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.