
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ టీచర్ స్టూడెంట్ కు పనిష్మెంట్ ఇచ్చింది. దీంతో ఆ బాలిక చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. రాజధాని బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు మరణానికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉగ్రవాద నిధుల కేసు.. దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ
బాలిక తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని రామచంద్రపురలోని కొబ్బరి తోటలోని ఆర్డీ ఇంటర్నేషనల్ స్కూల్ లో 9 సంవత్సరాల బాలిక నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో శుక్రవారం స్కూల్ లో ఉండగానే ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. దీంతో స్కూల్ యాజమాన్యం వెంటనే ఆ స్టూడెంట్ ను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. ఈ విషయాన్ని స్కూల్ సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు తెలిజేశారు. దీంతో వారు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది.
సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్.. డాక్టర్ అనహిత పండోల్‌పై ఎఫ్ఐఆర్
కాగా.. తన కూతురు స్కూల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని, దీనిపై విచారణ జరిపించాలని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్కూల్ లో టీచర్ పనిష్మెంట్ ఇవ్వడం వల్లే తమ కూతురు చనిపోయి ఉంటుందని బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. కాగా.. హాస్పిటల్ లో బాలికను పరీక్షించగా శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు లేవని పోలీసులు తెలిపారు.
Old Monk Tea: తందూరీ చాయ్‌లో ఓల్డ్ మంక్ రమ్ పోసి అమ్ముతున్న గోవా వ్యాపారి.. వీడియో వైరల్
అయితే దీనిని పోలీసులు అసహజ మరణంగా కేసుగా నమోదు చేశారు. ఆమె ఎలా మరణించిందో తెలుసుకునేందుకు పోలీసులు పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. స్టూడెంట్ ను హాస్పిటల్ కు తరలించడంలో జాప్యం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.