రాందేవ్ బాబాకు అరుదైన గౌరవం.. న్యూయార్క్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం

By Sairam Indur  |  First Published Jan 30, 2024, 3:12 PM IST

ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా మైనపు విగ్రహం న్యూయార్క్ లో ఉన్న ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చోటు దక్కించుకుంది. (Ramdev's wax statue at Madame Tussauds museum in New York) ఆ విగ్రహాన్నిఢిల్లీలో మంగళవారం ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 


ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబాకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన మైనపు విగ్రహాన్ని న్యూయార్క్ లోని ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియం టైమ్స్ స్క్వేర్ నడిబొడ్డున ఉంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మ్యూజియంలో చోటు దక్కించుకున్న తొలి సాధువు బాబా రాందేవ్ కావడం విశేషం.

14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. ముగ్గురు యువకులను దోషులుగా తేల్చిన పోక్సో కోర్టు

Latest Videos

undefined

ఆ విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసే ముందు మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆవిష్కరించారు. అచ్చుగుద్దినట్టు ఉన్న ఆ మైనపు విగ్రహానికి రామ్ దేవ్ బాబా తిలకం దిద్దారు. ఆ విగ్రహం వృక్షాసన యోగాసన భంగిమలో ఉండటంతో ఆయన కూడా ఆసనం వేశారు.

| Wax figure of Yog Guru Ramdev unveiled at an event of ‘Madame Tussauds New York’ in Delhi. pic.twitter.com/xFmsUyKWHm

— ANI (@ANI)

మైనపు విగ్రహం పక్కనే రామ్ దేవ్ బాబా యోగాసన భంగిమలో నిలబడ్డారు. దీంతో విగ్రహం ఏదో ? అసలైన రామ్ దేవ్ బాబా ఎవరో గుర్తు పట్టడం కొంచెం కష్టంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోల్లో పతంజలి యోగపీఠ్ సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ఆచార్య బాలకృష్ణ కూడా వేదికపై కనిపించారు.

గూగుల్ మ్యాప్స్ ఎంత పని చేసింది.. ఫాస్టెస్ట్ రూట్ లో వెళ్తే మెట్లపైకి తీసుకెళ్లి.. వీడియో వైరల్

తన ప్రతిరూపాన్ని ఆవిష్కరించిన అనంతరం బాబా రామ్‌దేవ్ మాట్లాడారు. మైనపు విగ్రహం అద్భుతంగా ఉందని, అందులో తనకు 8 ఏళ్ల వయసులో ఏర్పడిన గాయం కూడా కనిపిస్తోందని తెలిపారు. కాగా.. స్వామి రామ్‌దేవ్ మైనపు విగ్రహాన్ని తయారు చేసేందుకు 200 మంది కళాకారులు వేర్వేరు కొలతలు తీసుకున్నారు. 

బీజేపీ నేత హత్య కేసు.. 15 మంది దోషులకు మరణ శిక్ష

ప్రపంచవ్యాప్తంగా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కనిపించే ప్రముఖుల జాబితా ఇదే..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ - మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం, లండన్
అమితాబ్ బచ్చన్ - మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం, లండన్, హాంకాంగ్, బ్యాంకాక్, సింగపూర్, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూఢిల్లీ
షారుఖ్ ఖాన్ - మేడమ్ టుస్సాడ్స్, లండన్
సచిన్ టెండూల్కర్ - మేడమ్ టుస్సాడ్స్, లండన్
ఐశ్వర్య రాయ్ బచ్చన్ - మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం, న్యూయార్క్
సల్మాన్ ఖాన్ - మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం, న్యూయార్క్

click me!