14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. ముగ్గురు యువకులను దోషులుగా తేల్చిన పోక్సో కోర్టు

By Sairam Indur  |  First Published Jan 30, 2024, 1:59 PM IST

2022 మే నెలలో కేరళలో పశ్చిమ బెంగాల్ కు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం (Poopara minor gangrape case) జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తాజాగా  దేవికుళం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (Devikulam Fast Track Special Court) ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చింది.


2022లో పశ్చిమ బెంగాల్ కు చెందిన 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను కేరళలోని దేవికుళం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (పోక్సో) దోషులుగా తేల్చింది. దోషుల్లో తమిళనాడుకు చెందిన సుగంద్ (20), శివకుమార్ (21), పూపారాకు చెందిన శామ్యూల్ అలియాస్ శ్యామ్ (21)లు ఉన్నారు. వీరికి న్యాయమూర్తి పి.సిరాజుద్దీన్ పీఏ మంగళవారం శిక్షలు ఖరారు చేయనున్నారు.

బ్రేకింగ్.. బీజేపీ నేత హత్య కేసు.. 15 మంది దోషులకు మరణ శిక్ష

Latest Videos

ఈ కేసులో నాలుగో నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు మైనర్లు తొడుపుళలోని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు విచారణను ఎదుర్కోనున్నారు. కాగా.. బాలికపై 2022 మే 29 న పూపారాలోని తేయాకు తోటలో సామూహిక అత్యాచారం జరిగిందని, సంతపారా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్మిజు కె దాస్ తెలిపారని ‘ఆన్ మనోరమా’ పేర్కొంది. ఈ ఘటనపై మున్నార్ డీఎస్పీ కేఆర్ మనోజ్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు.

గూగుల్ మ్యాప్స్ ఎంత పని చేసింది.. ఫాస్టెస్ట్ రూట్ లో వెళ్తే మెట్లపైకి తీసుకెళ్లి.. వీడియో వైరల్

బాధితురాలి తల్లిదండ్రుల ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్ నుంచి కేరళలోని ఇడుక్కికి వచ్చారు. వారితో పాటు బాలిక కూడా వచ్చి నివసించేది. అయితే 2022 మే 29వ తేదీన మధ్యప్రదేశ్ కు చెందిన తన స్నేహితుడితో కలిసి తేయాకు ఎస్టేట్ కు వచ్చారు. అయితే అక్కడే పని చేస్తున్న పలురువు కూలీల్లో ఓ నిందితుడు బాలిక స్నేహితుడిని చితకబాదాడు. అనంతరం పగిలిన బీరు బాటిళ్లతో దాడి చేస్తామని హెచ్చరించాడు. కొంత సమయం తరువాత మరో ఇద్దరు మైనర్ నిందితులు బాలిక స్నేహితుడిని ఎస్టేట్ లోని మరో ప్రాంతానికి తీసుకెళ్లారు.

టీటీడీ చరిత్రలో రికార్డ్.. తొలిసారి రూ.5 వేల కోట్లు దాటిన ఆలయ వార్షిక బడ్జెట్

అనంతరం ముగ్గురు నిందితులు నేరానికి పాల్పడగా, నాలుగో నిందితుడు నేరం జరిగిన ప్రాంతానికి కాపలాగా ఉన్నాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాంతంలో వైద్య, ముఠాను చూసిన సాక్షుల ఆధారంగా ప్రాసిక్యూషన్ దర్యాప్తు చేపట్టింది. 24 మంది ప్రాసిక్యూషన్ సాక్షులు, 43 డాక్యుమెంట్లను సాక్ష్యాలుగా సమర్పించారు. కాగా.. బాధితురాలు ప్రస్తుతం ప్రభుత్వ రెస్క్యూ హోంలో ఉంది. దోషులుగా తేలిన నిందితులు దినసరి కూలీలుగా పని చేసేవారు.

click me!