ఆగి ఉన్న బస్సును కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం కర్ణాటకలోని మండ్యలో జరిగింది. కారు వేగంగా ఢీకొట్టడం వల్ల దాని ముందు భాగం బస్సులోకి చొచ్చుకెళ్లింది.
ఆగి ఉన్న బస్సును ఓ కారు వెనక నుంచి వచ్చి వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ కారు ముందు భాగంగా బస్సులోకి చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మృతులంతా కారులో ఉన్నవారే. బస్సులో ఉన్నవారికి గాయాలు కాలేదు. ఈ ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరుకు చెందిన బెండిగానహళ్లి నమిత, ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేసే రాజస్థాన్ కు చెందిన పంకజ్ శర్మ, హోసకోటె వాసి అయిన వంశీకృష్ణ, ధారవాడకు ప్రాంత వాసి అయిన రఘునాథ్ భజంత్రి ఓ కారులో బుధవారం ఉదయం బెంగళూరు-మంగళూరు నేషనల్ హైవే నెంబర్ - 75పై కారులో ప్రయాణిస్తున్నారు. అయితే ఆ కారు మండ్య జిల్లాలోని నాగమంగల మండలం ఆదిచుంచనగిరి హాస్పిటల్ వద్దకు చేరుకోగానే అక్కడ ఆగి ఉన్న కేసీఆర్టీసీ బస్సును వెనుక నుంచి స్పీడ్ గా ఢీకొట్టింది.
రాజస్థాన్ లోని కోటాలో మరో స్టూడెంట్ సూసైడ్.. 26కు చేరిన బలవన్మరణాలు..
కారు స్పీడ్ గా ఉండటం వల్ల దాని ముందు భాగం బస్సులోకి దూసుకెళ్లింది. దీంతో బస్సు కూడా ఒక్క సారిగా కుదుపునకు లోనైంది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల వయస్సు 30-35 మధ్య ఉంటుందని పోలీసులు వెల్లడించారు. కాగా.. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే బెళ్లూరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
చిప్స్ ఆశ చూపి.. ఏడేండ్ల చిన్నారిపై అత్యాచారం,హత్య..ఆపై మృతదేహాన్ని..
కారును అతికష్టం మీద బయటకు తీశారు. అనంతరం డెడ్ బాడీలను హాస్పిటల్ కు తరలించారు. అయితే కారు అతివేగంగా ఉండటం, దానిని డ్రైవర్ అదుపు చేయలేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.