రాజస్థాన్ లోని కోటాలో మరో స్టూడెంట్ సూసైడ్.. 26కు చేరిన బలవన్మరణాలు..

Published : Sep 29, 2023, 07:15 AM IST
రాజస్థాన్ లోని కోటాలో మరో స్టూడెంట్ సూసైడ్.. 26కు చేరిన బలవన్మరణాలు..

సారాంశం

రాజస్థాన్ లోని కోటాలో మరో విద్యార్థి బలవన్మరణానికి ఒడిగట్టారు. గత కొంత కాలంగా ఆ ప్రాంతంలో విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఉద్యోగాల కోచింగ్‌కు, ఉన్నత చదువులకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌ లోని కోటా లో స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు స్థానిక అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయినా కూడా అక్కడ ఈ బలవన్మరణాలు ఆగడం లేదు.

బాలికపై పలుమార్లు యువకుడి అత్యాచారం.. వీడియో తీసి ఫ్రెండ్స్ కు షేర్.. మళ్లీ ఏగుగురు కలిసి గ్యాంగ్ రేప్..

తాజాగా కూడా అక్కడ మరో ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది. యూపీకి చెందిన ఓ విద్యార్థి బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరం ఈ కోటాలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. యూపీకి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడ ఇప్పటి వరకు 26 మంది బలవన్మరణానికి పాల్పడినట్టు లెక్కలు చెబుతున్నాయి.

Telangana Cabinet: ఇంకా జ్వరంతో బాధపడుతున్న గులాబీ బాస్.. నేడు జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా..

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !