ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్..

By Sumanth KanukulaFirst Published Jun 5, 2023, 11:23 AM IST
Highlights

ఒడిశాలోని బాలసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన జరిగిన కొద్ది రోజులకే ఒడిశాలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

ఒడిశాలోని బాలసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన జరిగిన కొద్ది రోజులకే ఒడిశాలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బార్‌ఘర్ జిల్లాలో గూగ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలులో సున్నపురాయిని తీసుకెళ్తున్నారు. అయితే గూడ్స్ రైలులోని అనేక వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే రైలు పట్టాలు తప్పడంతో.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. 

అయితే ఈ ఘటనతో రైల్వేకు ఎటువంటి  సంబంధం లేదని రైల్వే శాఖ తెలిపింది. ‘‘ఒడిశాలోని బార్‌ఘర్ జిల్లా మెంధపలి సమీపంలోని ఫ్యాక్టరీ ఆవరణలో ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ నడుపుతున్న గూడ్స్ రైలుకు చెందిన కొన్ని వ్యాగన్‌లు పట్టాలు తప్పాయి. ఈ విషయంలో రైల్వే పాత్ర లేదు’’ ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది.

ఇది పూర్తిగా ప్రైవేట్ సిమెంట్ కంపెనీకి చెందిన నారో గేజ్ సైడింగ్.. రోలింగ్ స్టాక్, ఇంజన్, వ్యాగన్లు, రైలు ట్రాక్‌లు (నారో గేజ్) సహా అన్ని మౌలిక సదుపాయాలను కంపెనీ నిర్వహిస్తోందని ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది.

click me!