విద్యార్థులతో వెళ్తున్న బస్సు- ట్రక్కు ఢీ.. ఇద్దరు మృతి, 35 మందికి గాయాలు

By Mahesh RajamoniFirst Published Jun 5, 2023, 11:39 AM IST
Highlights

Shivpuri: మధ్యప్రదేశ్ లో విద్యార్థులతో వెళ్తున్న బస్సు- ట్రక్కు ఢీకొని ఇద్దరు మృతి ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 35 మంది గాయ‌ప‌డ్డారు. వనవాసి లీలా కార్యక్రమంలో భాగంగా 'లక్ష్మణ్ లీలా' నాటకం ప్రదర్శించి గ్వాలియర్ నుంచి అగర్ పట్టణానికి వెళ్తున్న నర్మదాపురం డివిజన్ కు చెందిన విద్యార్థులు, కళాకారులతో కూడిన‌ బస్సు ప్రమాదానికి గురైందని శివపురి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి వికాస్ యాదవ్ తెలిపారు.
 

Madhya Pradesh road accident: మధ్యప్రదేశ్ లో విద్యార్థులతో వెళ్తున్న బస్సు- ట్రక్కు ఢీకొని ఇద్దరు మృతి ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 35 మంది గాయ‌ప‌డ్డారు. వనవాసి లీలా కార్యక్రమంలో భాగంగా 'లక్ష్మణ్ లీలా' నాటకం ప్రదర్శించి గ్వాలియర్ నుంచి అగర్ పట్టణానికి వెళ్తున్న నర్మదాపురం డివిజన్ కు చెందిన విద్యార్థులు, కళాకారులతో కూడిన‌ బస్సు ప్రమాదానికి గురైందని శివపురి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి వికాస్ యాదవ్ తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే..  మధ్యప్రదేశ్ లోని శివ్ పురి జిల్లాలో సోమ‌వారం ఉదయం బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 35 మంది గాయపడ్డారు. వనవాసి లీలా కార్యక్రమంలో భాగంగా 'లక్ష్మణ్ లీలా' నాటకం ప్రదర్శించి గ్వాలియర్ నుంచి అగర్ పట్టణానికి వెళ్తున్న నర్మదాపురం డివిజన్ కు చెందిన విద్యార్థులు, కళాకారులతో బస్సు ప్రమాదానికి గురైందని శివపురి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి వికాస్ యాదవ్ తెలిపారు.

శివపురి శివార్లలోని ఓ ఫ్యాక్టరీ సమీపంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు టైర్లలో ఒకటి అకస్మాత్తుగా పేలడంతో డ్రైవర్ వాహ‌నంపై నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును పక్క నుంచి ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని అధికారులు తెలిపారు. మృతులను ఆర్టిస్ట్ అమన్, బస్సు డ్రైవర్ కరణ్ యాదవ్ గా గుర్తించామనీ, వారి వయసు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు న‌మోదుచేసుకునీ, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

click me!