రేప్ ఆరోపణలు: దాతీ మహారాజ్ ఆశ్రమం నుండి 600 యువతుల అదృశ్యం

First Published Jun 17, 2018, 11:36 AM IST
Highlights

మరో డేరాబాబా ఉదంతం


న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపనలు ఎదుర్కొంటున్న వివాదాస్పద గురువు దాతీ మహారాజ్ ఆశ్రమం నుండి సుమారు 600 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని పోలీసులు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఆశ్రమం నుండి అదృశ్యమైన బాలికలు ఎక్కడికెళ్ళారనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వాస్‌లోని దాతీ మహారాజ్ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. తనకు తానుగానే దాతీ మహారాజ్ దేవుడిగా పేర్కొంటాడు. 

ఆశ్రమంలో 700 మంది అమ్మాయిల బాగోగులు తానే చూసుకొంటానని మహరాజ్ చెబుతున్నాడు.అయితే ఆశ్రమంలోనే తనపై దాతీ మహారాజ్ అత్యాచారం చేశాడని 25 ఏళ్ళ యువతి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై దాతీ మహారాజ్ స్పందించారు. ఈ ఆరోపణలను ఖండించారు. బాధితురాలు తనకు కూతురు వంటిదన్నారు. తాను ఎవరిపై కూడ అత్యాచారానికి పాల్పడలేదన్నారు. 

ఆశ్రమంలో కేవలం 100 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారని పోలీసులు గుర్తించారు. మిగిలిన అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళారనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. దాతీ మహారాజ్ పై అత్యాచారం కేసు నమోదు కావడంతో ఆయన ఆశ్రమం నుండి పారిపోయారని పోలీసులు చెప్పారు. అతని కోసం కూడ గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

దాతీ మహారాజ్ తనను దశాబ్దం పాటు ఆశ్రమంలో బందీగా ఉంచాడని, ఆయనతో పాటుఆయన ఇద్దరు అనుచరులు తనను రేప్ చేశారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ఆయన వద్ద ఉండే మహిళా సహాయకురాలు, అమ్మాయిలను బలవంతంగా ఆయన గదిలోకి పంపుతుందని తెలిపింది. 


 

click me!