ఛత్ ఉత్సవాల్లో నీటిలో మునిగి 53 మంది మృతి.. బీహర్ లో ఘటన

By team teluguFirst Published Nov 2, 2022, 3:48 AM IST
Highlights

బీహార్ లో జరిగిన ఛత్ పూజా ఉత్సవాల్లో 53 మంది మరణించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్ట పరిహారం అందించాలని సీఎం నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. 

బీహార్ లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఛత్ ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని నదులు, ఇతర నీటి వనరులలో 53 మంది మునిగి మరణించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారి మంగళవారం వెల్లడించారు. ఈ ఘటనలపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.  మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారని ఆ అధికారి పేర్కొన్నారు.

తక్కువ లోతులో నీరు, నది అడుగులో రాళ్లే ప్రాణ నష్టానికి కారణం.. గుజరాత్ బ్రిడ్జి విషాదంపై ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్

మృతుల కుటుంబాలకు త్వరగా ఎక్స్ గ్రేషియా చెల్లింపులు జరిగేలా చూడాలని అన్ని జిల్లాల మెజిస్ట్రేట్‌లను సీఎం ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 30వ తేదీన పూర్నియా జిల్లాలో జరిగిన ఘటనలో ఐదుగురు మునిగి చనిపోయారు. అలాగే పాట్నా, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, సహర్సా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించారని చెప్పారు.

గయా, బెగుసరాయ్, కతిహార్, బక్సర్, కైమూర్, సీతామర్హి మరియు బంకా జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. పండుగ చివరి రోజైన అక్టోబర్ 31వ తేదీన రాష్ట్రంలో దాదాపు 18 మంది మరణించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు మరణించిన వారందరి వివరాలు గుర్తించడానిక ప్రయత్నిస్తున్నారు.

మోర్బీ బ్రిడ్జీ ఘటనతో అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్.. 2,109 వంతెనల ఫిట్ నెస్ ను పరీక్షించాలని మమతా సర్కార్ ప్లాన్

కాగా.. పాట్నాలోని వివిధ ఛత్ పూజ సందర్భంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా గాయపడ్డారు. అక్టోబర్ 15వ తేదీన ఛాత్ ఘాట్‌లను పరిశీలించేందుకు పాట్నాలోని గంగానది వద్దకు వెళ్లారు. ఈ సమయంలో స్నాన ఘాట్ల వద్ద ఛత్ పూజ ఏర్పాట్లను  పరిశీలిస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న స్టీమర్ జేపీ సేతు వంతెనను ఢీకొట్టింది. అకస్మాత్తుగా ఇది జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ప్రమాదంలో నితీష్ కుమార్ పొట్ట భాగంలో, కాళ్లకు గాయాలు అయ్యాయి. అయితే బోటులోని వారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

జమ్మూ కాశ్మీర్ లో జాయింట్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్.. నలుగురు ఉగ్రవాదులు హతం..

కానీ ఈ విషయాన్ని బయటకు రాలేదు. సుమారు 11 రోజుల తరువాత అంటే అక్టోబర్ 26వ తేదీన ఇది వెలుగులోకి వచ్చింది. ఆ గాయాలకు ఆయన ట్రీట్ మెంట్ తీసుకున్నారు. అదే రోజు సీఎం నితీశ్‌ కుమార్‌ బుధవారం కారులో వెళ్లి ఏర్పాట్లను మరోసారి ఛట్ పూజ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను బోటు ప్రమాదంలో గాయపడినట్టు స్వయంగా వెల్లడించారు. కడుపుకు అయిన గాయాన్ని కూడా వెల్లడించారు. అయితే సీఎం ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది.

click me!