
శనివారం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని ప్రభావం ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్‌లలో కనిపించింది... కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది.
ఎన్సిఎస్ ప్రకారం భూకంపం మధ్యాహ్నం 12:17 గంటలకు చోటుచేసుకుంది. భూకంప కేంద్రం 86 కి.మీ. లోతులో ఉంది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి.
కాశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ భూకంప సమయంలో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుండి బయటకు పరుగెత్తుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కొంతమేర ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం.