40 మంది మహిళలకు ఒక్కడే భర్త.. వారి పిల్లలకు తండ్రి కూడా అతడే.. రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి షాకైన ఆఫీసర్లు..

By Asianet NewsFirst Published Apr 26, 2023, 10:21 AM IST
Highlights

బీహార్ లోని అర్వాల్ ప్రాంతానికి చెందిన 40 మంది మహిళలు తమ భర్త పేరు రూప్ చంద్ గా పేర్కొన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అధికారులు విషయం ఏంటో తెలుసుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లి షాక్ అయ్యారు. 

బీహార్‌లో ఓ విచిత్రం వెలుగులోకి వచ్చింది. అర్వాల్‌లో 40 మంది మహిళలు తమకు ఒక్కరే భర్త అని పేరు నమోదు చేసున్నారు. ఆయన పేరు రూప్‌చంద్‌ అని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ఉండే అనేక మంది పిల్లలు కూడా తమ తండ్రి పేరు రూప్ చంద్ అనే నమోదు చేసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా ఆ రాష్ట్రంలో కుల గణన చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను గమనించి అధికారులు ఆశ్చర్య పోయారు. అసలు నిజం ఏంటో తెలుసుకుందామని ఆ మహిళలు ఉంటున్న రెడ్ లైట్ ఏరియాకు వెళ్లారు. విషయం తెలుసుకొని షాక్ కు గురయ్యారు.

భారత్ పై జర్మనీ అక్కసు.. జనాభా పెరుగుదలను చూపిస్తూ వ్యంగ్యంగా కార్టూన్.. మండిపడుతున్న నెటిజన్లు

Latest Videos

అర్వాలో లోని వార్డు నంబర్-7 ఓ రెడ్ లైట్ ఏరియా ఉంది. ఈ ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఏళ్ల తరబడి నివసిస్తున్నారు. కుల గణన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే వారిలో దాదాపు 40 మంది మహిళల భర్త పేరు రూప్‌చంద్‌ అని తెలిపారు. వారి పిల్లలు కూడా తమ తండ్రి పేరు రూప్ చంద్ అని చెప్పారు. 

ఈ వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో అత్యధిక మంది భర్త పేరు రూప్ చంద్ అని ఉంది. అసలు నిజం ఏంటో తెలుసుకుందామని అధికారులు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లారు. అసలు విషయం ఏంటో కనుక్కునేందుకు ప్రయత్నించారు. వారి ఎంక్వేరీలో అసలు రూప్ చంద్ అంటే మనిషి కాదని తేలింది.

పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మరణం.. 2 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం

అక్కడున్న వారందరూ డబ్బును రూప్ చంద్ అని అంటారు. అక్కడి ప్రజల అభిప్రాయం ప్రకారం రూపాయి అంటే రూప్ చంద్ అని అర్థం. రెడ్ లైట్ ఏరియాలో నివసించే ప్రజలు రూపాయినే తమ సర్వసంగా భావిస్తారు. పిల్లలు కూడా అలాంటి అభిప్రాయాన్నే కలిగి ఉన్నారు. అందుకే తమ భర్త, తండ్రి పేరు ఏమంటే అందరూ రూప్ చంద్ అనే చెబుతున్నారు. 

మంచిర్యాలలో దారుణం.. అందరూ చూస్తుండగానే యువకుడి హత్య.. బండలతో కొడుతున్న వీడియో వైరల్..

కాగా.. బీహార్ ప్రభుత్వం కొంత కాలం నుంచి కుల గణన చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రజల ఆర్థిక, సామాజిక నేపథ్యం తెలుసుకుని వారి అభివృద్ధికి పథకాలు రూపొందించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ గణన కోసం ప్రభుత్వం దాదాపు 500 కోట్ల బడ్జెట్‌ను కూడా ఖరారు చేసింది. దీని కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి 17 అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే అర్వాల్‌లోని రెడ్‌లైట్ ఏరియా నుంచి ఈ విచిత్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. 

click me!