రిషికేష్ లో అమెరికా మహిళపై రేప్ కేసులో అసలు ట్విస్ట్ ఇదీ...

By telugu teamFirst Published Oct 9, 2020, 7:39 AM IST
Highlights

రిషికేష్ లో అమెరికా మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. అయితే, ఆ ఘటనకు ముందు అతనితో అమెరికా మహిళ పలుమార్లు సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

రిషికేష్: ఉత్తరాఖండ్ లోని రిషికేష్ లో అమెరికాకు చెందిన మహిళ అత్యాచారానికి గురైంది. అమెరికాకు చెందిన 37 ఏళ్ల యోగా ఔత్సాహికురాలు. ఆమె రిషికేష్ లోని ఓ గదిలో నివాసం ఉంటోంది. అక్టోబర్ 5వ తేదీన రిషికేష్ నివాసి అభినవ్ రాయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

బాల్కనీ మీదుగా అమెరికా మహిళ ఉన్న గదిలోకి అతను చొరబడ్డాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసినట్లు మునీకి రేటి పోలీసు అధికారి ఆర్కె సక్లానీ చెప్పారు అమెరికా మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కేసును ఉపసంహరించుకోవానలి అభినవ్ రాయ్ తండ్రి తనపై ఒత్తిడి తెస్తున్నాడని అమెరికా మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, అక్టోబర్ 5వ తేదీ అత్యాచార ఘటనకు ముందు ఆమె అభినవ్ రాయ్ ను తన గదికి పిలిచి అతని అతనితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. 

అమెరికా మహిళ డ్రగ్, యోగా పట్ల ఆసక్తితోనే అభినవ్ రాయ్ కి దగ్గరైందని పోలీసులు అంటున్నారు. 5వ తేదీకి ముందు పలుమార్లు ఆమె అతనితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

click me!