ముంబై: డ్రగ్స్ దందా గుట్టురట్టు.. ఏకంగా రూ.879 కోట్ల హెరాయిన్ స్వాధీనం

By Siva KodatiFirst Published Jul 4, 2021, 9:47 PM IST
Highlights

అఫ్ఘనిస్థాన్ నుంచి పెద్ద మొత్తంలో హెరాయిన్ తరలిస్తున్న ఓ స్మగ్లర్‌ను మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 879 కోట్ల విలువైన 300 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

అఫ్ఘనిస్థాన్ నుంచి పెద్ద మొత్తంలో హెరాయిన్ తరలిస్తున్న ఓ స్మగ్లర్‌ను మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 879 కోట్ల విలువైన 300 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇరాన్, అఫ్గానిస్థాన్ నుంచి అక్రమంగా తరలించిన సరకును జిప్సమ్ స్టోన్, టాల్కమ్ పౌడర్‌గా అధికారులు గుర్తించారు.   

Also Read:బంజారాహిల్స్‌లోని ఇంటిలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. నైజిరియా నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్

ఈ సరకును సరఫరా చేస్తున్న ప్రబ్‌జోత్‌సింగ్ అనే నిందితుడిని రాయ్‌గఢ్ సమీపంలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌టీ) సమీపంలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఏడాది నుంచి నిందితుడు మత్తు పదార్థాల దందా కొనసాగిస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. గతేడాది ఆగస్టులోనూ ఆయుర్వేదిక్ మందుల పేరిట హెరాయిన్ సరఫరా చేస్తున్న కంటైనర్‌ను డీఆర్‌ఐ బృందాలు గుర్తించాయి. అప్పుడు రూ.1000 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను సీజ్ చేశాయి. అప్పుడు కూడా ఆ మత్తు పదార్థాలు అఫ్ఘనిస్తాన్ నుంచే వచ్చినట్లుగా డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.  
 

click me!