మహారాష్ట్రలో దారుణం: మైనర్‌పై 29 మంది 9 నెలలుగా రేప్

By narsimha lodeFirst Published Sep 23, 2021, 4:46 PM IST
Highlights

మహారాష్ట్రలోని థానేలో దారుణం చోటు చేసుకొంది. మైనర్ బాలికపై 29 మంది 9 మాసాలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలిపు చర్యలు చేపట్టారు.

ముంబై:మహారాష్ట్రలోని (maharashtra) థానేలో (thane) 15 ఏళ్ల మైనర్ బాలికపై 29 మంది నెలల తరబడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

బాలికపై అత్యాచారం చేసిన వీడియోలను చూపి బ్లాక్ మెయిల్ చేసి పదే పదే అత్యాచారానికి దిగినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ వేధింపులు భరించలేదక బాధితురాలు మన్‌పడ పోలీసులకు  ఫిర్యాదు చేసింది.గత 9 మాసాలుగా తనపై 29 మంది అత్యాచారానకి పాల్పడినట్టుగా బాధితురాలు మన్‌పడ పోలీసులకు ఫిర్యాదు చేసిందని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్  దత్తాత్రేయ కరాలే చెప్పారు.

ఈ ఏడాది జనవరి నుండి సెప్టెంబర్ 22 వరకు 29 మంది అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంటనే ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి 23 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టుగా కరాలే చెప్పారు. నిందితుల్లో ఇద్దరు నిందితులున్నారని ఆయన వివరించారు. బాధితురాలిపై దోంబివాలి, రబలే, ముర్దాబాద్, బద్లాపూర్ తదితర ప్రాంతాల్లో అత్యాచారానికి పాల్పడ్డారని ఏసీపీ చెప్పారు.

నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా ఆయన తెలిపారు.ఈ ఏడాది జనవరి మాసంలో బాలికపై ఆమె స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను రికార్డు చేశాడు.  ఈ వీడియో మరో నిందితుడికి చేరింది. ఈ వీడియోను చూపి నిందితుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.ఇదే రకంగా పలువురికి ఈ వీడియో చేరడంతో ఈ వీడియోలను చూపి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు.

అత్యాచారానికి గురైన ప్రాంతాల్లో ఫోరెన్సిక్ టీమ్ ఆధారాల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. నిందితులు రికార్డు చేసిన వీడియోలను పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు నిందితులంతా ఒకే ప్రాంతానికి చెందినవారు.బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
 

click me!