Punjab Assembly Election 2022: దేశంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాయి.. నాయకులు తమ వ్యాఖ్యల్లో పదును పెంచారు. దీంతో పంజాబ్ రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి.
Punjab Assembly Election 2022: దేశంలో త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. త్వరలో ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా రాష్ట్రాలకు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాయి.. నాయకులు తమ వ్యాఖ్యల్లో పదును పెంచారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. పంజాబ్ లో అయితే, ఎన్నికల(Punjab Assembly Election 2022) పోరు మాములుగా లేదు. రాష్ట్రంలోని ప్రధాని పార్టీలన్ని అధికార పీఠం దక్కించుకోవడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న పొలిటికల్ గేమ్ లో రాజకీయ పార్టీలు రోజుకో కొత్త వ్యూహాన్ని ఎంచుకుంటున్నాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో రెండు అంశాలు కింగ్ మేకర్ గా నిలవనున్నాయని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే అర్థమవుతున్నది. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ సారి ఎన్నికలు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండనున్నాయని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం పంజాబ్ లో ఎన్నికల పరిస్థితులు భిన్నంగా మారడానికి అనేక అంశాలు కారణం అయ్యాయి. పంజాబ్ ప్రజల ఆకాంక్షలు పార్టీలు ఇచ్చే వాగ్దానాలతోపాటు పెండింగ్‌లో ఉన్న.. దీర్ఘకాలిక సమస్యల మధ్య ఈ ఎన్నికలు మాత్రం ఏ రెండు పార్టీల మధ్య కాకుండా పంచముఖ పోటీగా మారిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ ను నిర్ణయించే రెండు ప్రధాన అంశాల్లో ఒకటి రైతులు. ఎందుకంటే ఇక్కడి రైతుల నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడూ వ్యవసాయ చట్టలా రద్దుకు వ్యతిరేకంగా ఏడాదికి పైడా ఉద్యమం నడిచింది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ సర్కారు సైతం వెనక్కి తగ్గి.. ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఇక పంజాబ్ లో రైతు అంశాల నేపథ్యంలో రెండు కొత్త పార్టీలు సైతం పుట్టుకొచ్చాయి. అధికార కాంగ్రెస్ విడిపోవడం, బీజేపీకి వ్యతిరేక గాలులు వీచడం, ఆఫ్ అధిపత్యం కోసం ప్రయత్నాలు సాగించడం, శిరోమణి అకాలీదళ్ (బలంగా నిలబడుతుందా అనే అనుమానాల వంటి పరిస్థితులు గమనిస్తే.. ఏ పార్టీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ ఎన్నికల్లో (Punjab Assembly Election) కింగ్ మేకర్ గా నిలవనున్న రెండు ప్రధాన అంశాలు రైతులు ఒకటి కాగా, రెండోది దళిత అంశం. పంజాబ్ లో రైతు చైతన్యం బలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు రైతుల మద్దతు పొందడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, బీజేపీకి మాత్రం రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నదని స్థానిక పరిణామాలు చూస్తే అర్థమవుతున్నది. అయితే, రైతు అందోళనలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌కేఎమ్ (SKM) లోని ఒక విభాగం ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. పొరుగున ఉన్న హర్యానాకు చెందిన వ్యవసాయ నాయకుడు గుర్నామ్ సింగ్ చదుని చట్టాలను రద్దు చేయడానికి ముందే పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సంయుక్త సంఘర్ష్ పార్టీ (SSP)ని స్థాపించారు. పంజాబ్ ఎన్నికల్లో మరో కింగ్ మేకర్ దళిత అంశం. రైతుల అంశంలాగే, పంజాబ్‌లోని ఓటర్లు అధికంగా ఉన్న “దళిత అంశం” చుట్టూ కూడా రాజకీయాలు తిరిగుతున్నాయి. పంజాబ్ ఓటర్లలో దళితులు 32 శాతం ఉన్నారు. ఇది దేశంలోనే అత్యధికం. కాబట్టి ఆయా వర్గాల వారి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.