రైతుల కుమారులను పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు రూ.2 లక్షలిస్తాం - కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామి హామీ..

By Asianet NewsFirst Published Apr 11, 2023, 4:21 PM IST
Highlights

కర్ణాటకల ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ సందర్భంగా నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల హామీలను ఇస్తున్నారు. తాజాగా రైతు ఓటర్లను ఆకర్శించేందుకు జేడీఎస్ నాయకుడు కుమారస్వామి ఓ వింత వాగ్ధానం చేశారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న వేళ  మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి ఓటర్లకు విచిత్రమైన వాగ్దానాన్ని చేశారు. రైతుల కుమారులను పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. యువకుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు తాను ఈ పథకాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కోలార్ లో జరిగిన 'పంచరత్న' ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ పథకం వల్ల యువకుల వివాహాలు సులభతరమవుతాయన్నారు.

జాతీయ గీతానికి అవమానం.. సిగరెట్ తాగుతూ, వెకిలిగా నవ్వుతూ గీతాలాపన.. వీడియో వైరల్.. నెటిజన్ల మండిపాటు

“రైతుల కుమారులను పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలు సిద్ధంగా లేరని నాకు పిటిషన్ వచ్చింది. అందుకే రైతుల పిల్లల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడపిల్లలకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి. మన అబ్బాయిల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రవేశపెట్టనున్న కార్యక్రమాల్లో ఇది ఒకటి” అని కుమారస్వామిని చెప్పారని ‘ఇండియా టుడే’ నివేదించింది. జనతాదళ్ (సెక్యులర్) కర్ణాటకలో అధికారం చేపడితే ఈ పథకాన్ని ప్రారంభిస్తుందని చెప్పారు. 

రాజ్యాంగ పరిరక్షణ కోసం భావసారూప్యత కలిగిన పార్టీలతో కాంగ్రెస్ చేతులు కలుపుతుంది - సోనియా గాంధీ

కుమారస్వామి నేతృత్వంలోని జేడీ(ఎస్) ఓటర్లను ఆకర్శించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అనేక వర్గాలకు దగ్గరయ్యేందుకు పలు హామీలను ప్రకటిస్తోంది. ఇటీవల మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తామని, పేదలకు వైద్య సహాయం అందిస్తామని ప్రకటించారు. 

ఏప్రిల్ 30న సల్మాన్ ఖాన్ ను చంపేస్తా- బాలీవుడ్ కండల వీరుడికి మళ్లీ హత్యా బెదిరింపులు..ఈ సారి ‘రాఖీ భాయ్’ నుంచి

కాగా.. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం జేడీఎస్ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. టికెట్ల పంపిణీపై అంతర్గత కుటుంబ కలహాలకు తెరదించాలని భావిస్తోంది. మాజీ ప్రధాని దేవెగౌడ కోడలు భవానీ రేవణ్ణ, ఆమె కుటుంబ సభ్యులు హసన్ టికెట్ కోసం పట్టుబడుతున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం ఆమెకు టిక్కెట్లు ఇచ్చేందుకు సుముఖంగా లేరు. భవానీ రేవణ్ణ కుమారస్వామికి వరుసకు మరదలు అవుతారు.

మధ్యప్రదేశ్ లో నర్మదా నదిపై నడిచిన మహిళ.. దేవత అంటూ పూజించిన ప్రజలు.. వీడియో వైరల్

కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు, సెంట్రల్, కోస్టల్, హైదరాబాద్-కర్ణాటక, ముంబై-కర్ణాటక, దక్షిణ కర్ణాటక అనే 6 ప్రాంతాలలో 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జేడీఎస్ ఇప్పటికే 93 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కాపు సామాజిక వర్గానికి దగ్గరైన పార్టీగా పేరు పొందిన జేడీఎస్ ఈ సారి గతం కంటే రెట్టింపు స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు గెలిచినా, ప్రభుత్వ ఏర్పాటులో జేడీ(ఎస్) మద్దతు అవసరమని.. రాష్ట్రంలో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని కుమారస్వామి ఇప్పటికే చెప్పారు.
 

click me!