శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తల మృతి

By narsimha lode  |  First Published Apr 22, 2019, 12:53 PM IST

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తలు మృతి చెందారని కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రకటించారు. 
 



కొలంబో: శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తలు మృతి చెందారని కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రకటించారు. 

సోమవారం నాడు కర్ణాటక సీఎం కుమారస్వామి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనలో  సుమారు 295 మంది మృత్యువాత పడ్డారు. వందలాది మంది గాయపడ్డారు.

Latest Videos

undefined

 

Iam shocked to hear that a 7-member team of JDS workers from Karnataka, who were touring Colombo,has gone missing after the bomb blasts in .Two of them are feared killed in the terrorstrike.Iam in constant touch withthe Indian HighCommission onthe reports of those missing

— H D Kumaraswamy (@hd_kumaraswamy)

 

హనుమంతరాయప్ప,  ఎం. రంగప్పలు కూడ ఈ బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయారని ఆయన ప్రకటించారు. వీరిద్దరూ తనకు వ్యక్తిగతంగా కూడ తెలుసునని కుమారస్వామి చెప్పారు. ఈ మేరకు బాధిత కుటుంబాలను ఆదుకొంటామని  ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని కుమారస్వామి ప్రకటించారు.

కర్ణాటకలోని తుముకూరు, చికుబళ్లాపూర్ నుండి కొలంబోకు వెళ్లారు. అక్కడి షాంగ్రిల్లా హోటల్‌లో దిగారు. మరో ఐదుగురు జేడీ(ఎస్) కార్యకర్తల ఆచూకీ లేకుండా పోయింది. శ్రీలంకలోని  భారత హై కమిషనర్‌ కార్యాలయంతో  తాము టచ్‌లో ఉన్నట్టుగా కుమారస్వామి ప్రకటించారు.

సంబంధిత వార్తలు

శ్రీలంక పేలుళ్లు: టిఫిన్ కోసం క్యూలో నిలబడి.. పని ముగించిన ఉగ్రవాది

శ్రీలంకలో బాంబు పేలుళ్లు: తృటిలో తప్పించుకొన్న అనంతవాసులు

రంగంలోకి ఆర్మీ: 8 చోట్ల బాంబు దాడులతో వణుకుతున్న శ్రీలంక

శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే

10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు

click me!