విచారం: చౌకీదార్ చోర్ కామెంట్స్‌‌పై దిగొచ్చిన రాహుల్‌

Published : Apr 22, 2019, 12:12 PM ISTUpdated : Apr 22, 2019, 12:35 PM IST
విచారం: చౌకీదార్ చోర్ కామెంట్స్‌‌పై దిగొచ్చిన రాహుల్‌

సారాంశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు.  


న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

సోమవారం నాడు సుప్రీంకోర్టులో ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన  వివరణ ఇచ్చారు.ఎన్నికల ప్రచారంలో భాగంగానే తాను కాపలదారు దొంగ అనే వ్యాఖ్యలు చేసినట్టుగా రాహుల్ వివరణ ఇచ్చారు.ఎన్నికల ప్రచార వేడిలో భాగంగానే మాట దొర్లిందని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ప్రధాని మోడీపై చౌకీదార్ చోర్ కామెంట్స్ ‌పై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని రాహుల్ గాంధీ ప్రకటించారు. రాహుల్ గాందీ ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత మీనాక్షి లేఖి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 15వ తేదీన రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టుకు  నోటీసులు జారీ చేసింది. 

ఈ నెల 22వ తేదీ లోపుగా ఈ విషయమై సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. సుప్రీం నోటీసులకు రాహుల్ గాంధీ ఇవాళ సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై తాను విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. 
 

సంబంధిత వార్తలు

మీనాక్షి లేఖి ఫిర్యాదు: రాహుల్‌గాంధీకి సుప్రీం నోటీసులు

రాహుల్‌కు ఈసీ నోటీసుషాక్: 24 గంటల్లో వివరణ ఇవ్వాలి

PREV
click me!

Recommended Stories

టార్గెట్ 2035 .. ఈ రాష్ట్రంలో మురుగునీరే ఉండదట
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు