
మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలోని బీనా పట్టణంలో మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 17 మంది భక్తులకు గాయపడ్డారు. అధ్యాత్మిక కార్యక్రమం ముగిసిన తరవాత ప్రసాదం పంపిణీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. తొక్కిసలాట జరిగినప్పుడు ఈ కార్యక్రమంలో సుమారు 25,000 మంది భక్తులు ఉన్నారని ఒక అధికారి తెలిపారు.
పెదాలపై ముద్దుపెట్టడం, ప్రైవేట్ భాగాలను తాకడం... అసహజ లైంగిక నేరం కాదు : బాంబే హైకోర్టు
‘‘ ఖిమ్సాలా రోడ్డులోని బాగేశ్వర్ ధామ్ ఆలయంలో ఈ ఘటన జరిగింది. రామ్ కథ తర్వాత కొబ్బరి ప్రసాద పంపిణీ సమయంలో అకస్మాత్తుగా భారీ రద్దీ ఏర్పడింది. ఈ సంఘటనతో చాలా మంది గాయపడ్డారు" అని బినా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (బినా) శైలేంద్ర సింగ్ తెలిపారు.
ఆపద్భాంధవుడు : ఢిల్లీ అగ్నిప్రమాదంలో 50 మందిని కాపాడిన క్రేన్ డ్రైవర్.. ఇతనే రాకుంటే
గత వారం రోజులుగా రామ్ కథా కార్యక్రమం జరుగుతోందని ఎస్డీఎం తెలిపింది. ఆదివారం నాడు ఆ కార్యక్రమం చివరి రోజు కావున దాదాపు 25 వేల మంది వరకు భక్తులు ఆలయానికి వచ్చేశారు. కొబ్బరికాయను ప్రసాదంగా పంపిణీ చేస్తున్నప్పుడు దానిని స్వీకరించడానికి చాలా మంది ప్రజలు పరుగెత్తారు. దీంతో ఒక్క సారిగా రద్దీ పెరిగింది. దీని వల్ల పండల్ రెయిలింగ్ భక్తులపై పడింది. ఈ ఘటన వల్ల 17 మందికి గాయాలయ్యాయి అని ఎస్డీఎం పేర్కొంది.
Lunar Eclipse 2022: మరికొన్నిగంటల్లో తొలి చంద్రగ్రహణం.. పూర్తి వివరాలు మీకోసం..
గాయపడిన భక్తులను సాయంత్రం 4 గంటల వరకు సివిల్ హాస్పిటల్, బినా రి ఫైనరీ ఆసుపత్రికి తరలించినట్టు సివిల్ ఆసుపత్రి డాక్టర్ వీరేంద్ర పాఠక్ తెలిపారు. క్షతగాత్రుల్లో కాళ్ళలో ఫ్రాక్చర్ అయినట్టు డాక్టర్ చెప్పారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. వారికి ప్రాథమిక చికిత్స తరువాత ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చామని తెలిపారు. సాగర్ జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ ఆర్య మాట్లాడుతూ.. ఈ ఘటన సమాచారం అందిన వెంటనే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించినట్లు చెప్పారు.