
పశ్చిమ బెంగాల్ : బిర్యానీ కోసం మూడు లక్షలు చెల్లించినట్లు నకిలీ బిల్లు పెట్టాడో కాంట్రాక్టర్. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని కత్వా సబ్ డివిజనల్ ఆస్పత్రిలో జరిగింది. ఆసుపత్రి సూపర్డెంట్ గా సౌవిక్ ఆలం ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను చూసి షాక్ అయ్యారు. బిర్యానీ కోసం దాదాపు రూ. మూడులక్షలు వెచ్చించినట్లు ఓ కాంట్రాక్టర్ బిల్లు దాఖలు చేశాడు. కింగ్ షుక్ అనే కాంట్రాక్టరు ఆస్పత్రికి వివిధ రకాలైన వస్తువులను సరఫరా చేస్తారు.
ఫర్నిచర్, ఫార్మసీ, కారు ఖర్చుతో పాటు అనేక ఇతర బిల్లులను కలిపి సుమారు రూ.3 కోట్లు పెట్టాడు. సౌవిక్ వీటిని పరిశీలించగా.. 81 రకాల నకిలీ బిల్లులు కనిపించాయి. బిల్లుపై సంతకం చేసిన ప్రతి ఆరోగ్య కార్యకర్తలు విచారిస్తామని.. దోషులుగా తేలితే వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో మార్చి 4న ఓ విచిత్ర ఘటన జరిగింది. ఐదు రూపాయల కోసం జరిగిన గొడవ చివరికి court వరకు వెళ్ళింది.హోటల్ కు వెళ్లిన వ్యక్తికి తిన్నదానికంటే రూ.5.50 ఎక్కువగా బిల్లు వేసినందుకు వినియోగదారుడు హైదరాబాద్ జిల్లా Consumer Commissionను ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన జిల్లా వినియోగదారుల కమిషన్-2 బెంజ్ అధ్యక్షుడు నరసింహారావు Judgment వెలువరించారు.
ఫిర్యాదీపై పరుష పదజాలం ఉపయోగించడంతోపాటు
Serviceల్లో లోపం కలిగించినట్లు గుర్తించి.. అదనంగా వసూలు చేసినా రూ.5.50కి పది శాతం వడ్డీతో చెల్లించడంతో పాటు.. ఫిర్యాదీకి ఐదు వేల పరిహారం, జిల్లా వినియోగదారుల సంరక్షణ సంక్షేమం కోసం రూ.50 వేలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చెల్లించాలని ఆదేశించారు.
Chilukuri Vamsi ఉస్మానియా యూనివర్సిటీలోని గౌతమి హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. తన నలుగురు స్నేహితులతో కలిసి తిలక్ నగర్ లో ఉన్న లక్కీ బిర్యాని హౌజ్ కి వెళ్ళారు. బిల్లు రూ.1,075జీఎస్టీ కలుపుకుని మొత్తం రూ.1,127..50 అయ్యింది. మినరల్ వాటర్ బాటిల్ కు అదనంగా రూ.5 వసూలు చేశారని గుర్తించారు. దీన్ని ప్రశ్నించగా బిర్యాని హౌస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా తన నుంచి రూ.5.50 అదనంగా వసూలు చేశారని, స్నేహితుల ముందు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఫిర్యాది అందించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన బెంచ్.. ప్రతి వాది సంస్థ సేవల్లో లోపం ఉన్నట్లు గుర్తించింది. ఇకపై ఈ పొరపాటు చేయొద్దంటూ మందలిస్తూ 45 రోజుల్లో జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా, బిర్యానీ ఆశతో అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన నిరుడు డిసెంబర్ లో హైదరాబాద్ లోనే జరిగింది. ఓ దుర్మార్గుడు నాలుగేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. బంజారాహిల్స్ లో జరిగిన ఈ atrocityకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. Biryani తినిపిస్తానని నాలుగేళ్ల చిన్నారిని తన గదిలోకి రప్పించిన యువకుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన Jubileehills Police Stationపరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల సమాచారం ప్రకారం.. యూసుఫ్ గూడ రహ్మత్ నగర్ సమీపంలోని సంతోషిమాతా టెంపుల్ వద్ద నివసించే నాలుగేళ్ల చిన్నారిని పక్కింట్లో నివసిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెయింటర్ కోటేశ్వర్ రావు ఈ నెల 20 వ తేదీన మధ్యాహ్నం బిర్యానీ తిందాం రా అంటూ గదిలోకి పిలిచాడు.
ఆ చిన్నారి వచ్చిన తరువాత తనతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయంతో ఏడుస్తూ బయటికి వచ్చిన చిన్నారిని తల్లి ఏం జరిగిందని ప్రశ్నించింది. ఆ చిన్నారి కోటేశ్వర్ రావు తన పట్ల ప్రవర్తించిన తీరును తల్లికి తెలిపింది. చిన్నారి తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు కోటేశ్వర్ రావుకు ఐపీసీ సెక్షన్ 354(బి), పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.