వామ్మో.. సెకనుకు 6000 మీటర్ల వేగంతో భూమి వైపు ప్రయాణిస్తున్న 130 అడుగుల గ్రహశకలం

By team teluguFirst Published Jan 13, 2023, 4:47 PM IST
Highlights

అంతరిక్షం నుంచి ఓ గ్రహశకలం భూమి వైపు దూసుకోస్తోంది. ఇది 130 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ శకలం సెకనుకు 6000 మీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇది జనసాంద్రత ఉన్న ప్రదేశంలో భూమిని ఢీకొడితే తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. 

భూమి వైపు ఓ గ్రహశకలం దూసుకొస్తోంది. అదేదో చిన్న శకలం అనుకుంటే పొరపాటే. ఈ గ్రహకలకం 130 అడుగులు వెడల్పు ఉంటుందని నాసా అంచనా వేసింది. దీనికి ఆస్ట్రాయిడ్ -2022 వైఎస్5గా నాసా ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ నామకరణం చేసింది. నేటికి (జనవరి 13 నాటికి) గంటకు 5.9 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఈ గ్రహశకలం భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. ప్రస్తుతం ఇది గంటకు 21506 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు కదులుతోంది.

ఉపాధ్యాయులను శిక్షణకు పంప‌కుండా ఆపేందుకు బీజేపీ నీచ రాజకీయాలు.. : మ‌నీష్‌ సిసోడియా

ఈ గ్రహశకలం 2022 వైఎస్ 5 అపారమైన పరిమాణంలో ఉండటం వల్ల ఇది ఆందోళన కలిగిస్తోంది. ఈ గ్రహశకలం 130 అడుగుల వెడల్పును కలిగి ఉంటుందని నాసా ప్రకటించింది. ఇది దాదాపు ఓ పెద్ద సైజు విమానం పరిమాణంలో ఉంటుంది. అయితే ఈ శకలం భూమిని ఢీకొడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి జనసాంద్రత ఉన్న ప్రాంతంలో తాకితే ప్రజలకు, ఆస్తులకు హాని కలిగించవచ్చు.

సీజేఐగా డీవై చంద్రచూడ్ నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్.. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తులు

ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటుందని అంచనా వేయనప్పటికీ, భూ గురుత్వాకర్షణ ప్రభావం వల్ల అది భూమి వైపు దూసుకొచ్చే అవకాశమూ లేకపోలేదు. అయినా కూడా ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదు. ఎందుకంటే నాసా ఇప్పటికే డార్ట్ మిషన్ తో తన గ్రహ రక్షణ వ్యూహాన్ని పరీక్షించింది. ఇది భూమి నుంచి ఇలాంటి దారితప్పిన గ్రహశకలాల నుండి రక్షిస్తుంది.

అర్థరాత్రి ఇంటికి నిప్పు పెట్టిన ముసుగువ్యక్తులు.. తృటిలో తప్పించుకున్న కుటుంబం.. వీడియో వైరల్...

గ్రహశకలాలను నాసా ఎలా ట్రాక్ చేస్తుందంటే ? 
నాసా మద్దతుతో భూమి ఆధారిత టెలిస్కోప్ ల ద్వారా నిర్వహించిన సర్వేల ద్వారా భూమికి సమీపంలో ఉన్న అనేక వస్తువులు గుర్తించారు. వీటిలో మౌయి, హవాయిలోని పాన్స్-స్టార్స్1, అరిజోనాలోని టక్సన్ సమీపంలో కాటలినా స్కై సర్వే వంటివి ఉన్నాయి. భూమి చుట్టూ దాని ధ్రువ కక్ష్య నుండి సమీప పరారుణ కాంతి తరంగదైర్ఘ్యాల వద్ద ఆకాశాన్ని సర్వే చేస్తున్నప్పుడు నియోవైస్ అని పిలిచే అంతరిక్ష ఆధారిత టెలిస్కోప్ వందలాది ఇతర వస్తువులను కనుగొంది. భూ ఆధారిత రాడార్ ను ఉపయోగించి గ్రహశకలం లక్షణాలు, మార్గంపై నాసా వివరణాత్మక సమాచారాన్ని సేకరిస్తుంది.

ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ అరెస్టు అక్రమం: కేరళ హైకోర్టులో సీబీఐ

భూమికి సమీపంలో ఉన్న వస్తువుల ప్రభావ ప్రమాదాన్ని లెక్కించడానికి సెంట్రీ-II అనే అల్గారిథమ్‌ను ఉపయోగించే కొత్త టెక్నాలజీని కూడా నాసా కలిగి ఉంది. కొత్త ఆర్బిటర్‌ని ఉపయోగించి మరింత ఎక్కువ లోతైన డేటాను పొందేందుకు అంతరిక్ష సంస్థ ఎన్ఈవో సర్వేయర్ మిషన్‌ను 2026లో ప్రారంభించేందుకు నాసా ప్లాన్ చేసింది.

click me!