దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆరు నెలల్లో అత్యధిక కేసులు తాజాగా వెల్లడయ్యాయి. గడిచిన 24 గంటల్లో 107 కొత్త కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. పది రోజుల్లో తొలిసారిగా కరోనా మరణం కూడా సంభవించింది. ఢిల్లీలో శుక్రవారం 12 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 22కు పెరిగాయి.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ (Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (New Variant Omicron) భయాలు అధికం అవుతున్నాయి. కేసులూ సెంచరీ దాటేశాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఎలాంటి ఉపద్రవం ముంచుకు వస్తుందో తెలియని గందరగోళం నెలకొని ఉన్నది. ఇలాంటి తరుణంలో ఎక్కడ కేసులు పెరిగినా.. ఆందోళనలు కలుగుతున్నాయి. ఎందుకంటే.. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా తొలుత కరోనా పాజిటివ్‌గానే తెలుతాయి కదా.. ఆ తర్వాతే ఒమిక్రాన్ ధ్రువీకరణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ(Delhi) కేసులు పెరిగాయి. ఆరు నెలల్లో గరిష్ట సంఖ్యలో కేసులు(Cases) నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 107 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ఢిల్లీలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు మొత్తం 22 ధ్రువీకరించారు. శుక్రవారం ఒక్క రోజే ఇక్కడ 12 ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా, గుజరాత్‌లో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
చివరిసారిగా జూన్ 25న 115 కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి మళ్లీ అత్యధికంగా కేసులు తాజాగా రిపోర్ట్ అయ్యాయి. కాగా, పది రోజుల్లో తొలిసారి కరోనా మరణం సంభవించింది. తాజాగా, కరోనా వైరస్‌తో ఒకరు మరణించారు. కేసుల పాజిటివిటీ రేటు కూడా పెరుగుతున్నది. నిన్న పాజిటివిటీ రేటు 0.13 శాతం ఉండగా, నేడు ఇది 0.17 శాతానికి పెరిగింది. బుధవారం 57 కేసులు నమోదయ్యాయి. అప్పుడు పాజిటివిటీ రేటు 0.10 శాతం ఉన్నది. ఈ మూడు రోజుల వివరాల ప్రకారం.. పాజిటివిటీ రేటు కూడా మెల్లగా పెరుగుతూ వస్తున్నది.
Also Read: Omicron: గుజరాత్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు.. మొత్తం ఎన్నంటే?
ఢిల్లీలో ప్రస్తుతం మొత్తం 540 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 255 మంది పేషెంట్లు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలో మొత్తం కేసులు 14,42,197 రిపోర్ట్ అయ్యాయి. ఇందులో సుమారు 14.16 లక్షల పేషెంట్లు రికవరీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 50 మంది పేషెంట్లు డిశ్చార్జీ అయ్యారు. ఢిల్లీలో ఇప్పటి వరకు మూడు కరోనా మరణాలు సంభవించాయి. నవంబర్‌లో ఏడు కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్‌లో నాలుగు, సెప్టెంబర్‌లో ఐదు కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,905 టెస్టులు నిర్వహించారు. కేసులు పెరగడంతో ఢిల్లీలో మరో నాలుగు కంటైన్‌మెంట్ జోన్లు పెరిగాయి. ప్రస్తుతం మొత్తం కంటైన్‌మెంట్ జోన్లు 157గా ఉన్నాయి.
Also Read: ఏపీ: 24 గంటల్లో 121 కరోనా కేసులు.. చిత్తూరు జిల్లాలో అత్యధికం
ఆదివారం నాడు గుజరాత్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 145కు చేరుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్ నుండి ఇటీవల గుజరాత్‌కు వచ్చిన 45 ఏళ్ల ఎన్‌ఆర్‌ఐ, అలాగే ఓ యువకుడికి ఒమిక్రాన్ వేరియంట్ సోకడంతో దేశంలో ఒమిక్రాన్ కేసులు 145కు పెరిగాయి. గుజరాత్‌కు చెందిన ప్రవాస భారతీయుడు డిసెంబర్ 15న UK నుండి వచ్చిన వెంటనే అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతనికి RT-PCR కరోనా వైరస్ పరీక్షలో నిర్వహించారు. ఆ వ్యక్తికి కరోనా పాటివ్ గా రావడంతో శాంపిళ్లను జీనోమ్ సిక్వెన్సింగ్ కోసం పంపించారు.