ఆ పార్టీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోంది.. Priyanka Gandhi

Published : Dec 19, 2021, 07:45 PM IST
ఆ పార్టీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోంది.. Priyanka Gandhi

సారాంశం

రాహుల్ గాంధీ చేసిన హిందూత్వ వాది కామెంట్లను స‌పోర్టు చేస్తూ బీజేపీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ. బీజేపీ, ఆ పార్టీ అనుబంధం సంస్థ ఆర్ఎస్ఎస్ లు మతం పేరుతో  రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. హిందూయిజం  అంటే.. నిజాయతీ, అందరిపై ప్రేమ చూపిస్తుందని, కానీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు వాటిని ప‌క్క‌న బెట్టి మ‌త‌ప‌ర‌మైన రాజ‌కీయాలు చేస్తోన్నాయని ప్రియాంక ఆరోపించింది.  

కాంగ్రెస్ నేత‌, మాజీ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ చేసిన హిందూ - హిందుత్వవాది' వ్యాఖ్యలను స‌పోర్టు చేస్తూ.. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), భారతీయ జనతా పార్టీ (BJP) ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ రెండు పార్టీ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయ‌ని ఆరోపించారు.    హిందూయిజం నిజాయితీ, అంద‌రిపై ప్రేమను చూపిస్తుంద‌ని కాంగ్రెస్ లీడ‌ర్ అన్నారు. కానీ, RSS, BJPలు  నీతి, నిజాయితీని ప‌క్క‌న పెట్టాయ‌నీ, ఆర్ ఎస్ ఎస్, బీజేపీ నాయ‌కులు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నార‌నీ,  వారు నీతి,  నిజాయితీ మార్గంలో లేరని విమ‌ర్శించారు.

రాహుల్ గాంధీ ఆ తేడానే చూపిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. నేడు యూపీలోని కాంగ్రెస్ నిర్వ‌హించిన ప్ర‌చార సభ‌లో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రియాంక గాంధీ ఇన్ ఛార్జిగా వ్యవహరించనున్నారు. ఈ స‌భ‌లో ప్రియాంక మాట్లాడుతూ..  ప్రతిపక్ష పార్టీల ఫోన్లను బీజేపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందంటూ ఆరోపించారు.  హిందూత్వవాదులు దేశంలో బాధ, విచారానికి కారణమని అన్నారు. ఈ రోజు మన దేశంలో ఇవి ఉన్నాయంటే దానికి కారణం హిందూత్వవాదుల వల్లనే. హిందువులు సత్యాగ్రహాన్ని నమ్మితే.. హిందూత్వవాదులు రాజకీయ దురాశతో ప్రవర్తిస్తున్నారు’ అని ప్రసంగించారు.

Read Also: క్ష‌త‌గాత్రుల‌ను హాస్పిట‌ల్స్‌లో చేరిస్తే రూ. 5 వేలు ప్రైజ్‌.. ఎక్కడో తెలుసా ?v
 
ప్ర‌భుత్వం అంటే.. ప్ర‌జ‌ల‌ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడమే ప‌రిష్క‌రించ‌డ‌మ‌నీ, కానీ మోడీ.. పాల‌న‌లో  అభివృద్ధి కనబరచడం లేద‌ని, పైగా.. ప్ర‌శ్నించిన మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తుందని ఆరోపించారు.  మోడీ పాల‌న‌లో ద్రవ్యోల్బణం పెరుగుద‌ల‌, నిత్యావసరాల ధరల్లో పెరుగుదల, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు రికార్డు స్థాయికి పెరగడంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు.  ఇలా సామాన్య ప్ర‌జానీకం బాధ‌ల‌కు, దుఃఖానికి  హిందుత్వ‌వాదులే ప్ర‌త్యేక్ష కార‌ణ‌మ‌ని ప్రియాంక కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. ఈ సారి ఎన్నిక‌ల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Read Also: జైపూర్: లగేజ్ బ్యాగ్ ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ . పట్టేసిన కస్టమ్స్, రూ.90 కోట్ల హెరాయిన్ స్వాధీనం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు వ‌చ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి. ఈ క్ర‌మంలో అన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ ప్ర‌ణాళిల‌కు సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ ప్ర‌చారంలో భాగంగా.. ర‌థ‌యాత్ర‌లు ప్రారంభించింది. ఇక కాంగ్రెస్ కూడా ప్ర‌చారానికి రంగం సిద్దంచేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu