జైపూర్: లగేజ్ బ్యాగ్ ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ . పట్టేసిన కస్టమ్స్, రూ.90 కోట్ల హెరాయిన్ స్వాధీనం

By Siva Kodati  |  First Published Dec 19, 2021, 7:14 PM IST

జైపూర్‌ (jaipur airport) ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ను (drugs) పట్టుకున్నారు అధికారులు. షార్జా నుంచి జైపూర్ వచ్చిన ప్రయాణీకురాలి నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు (customs officials) . రూ.90 కోట్ల విలువైన హెరాయిన్‌ను సీజ్ చేశారు. 


జైపూర్‌ (jaipur airport) ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ను (drugs) పట్టుకున్నారు అధికారులు. షార్జా నుంచి జైపూర్ వచ్చిన ప్రయాణీకురాలి నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు (customs officials) . రూ.90 కోట్ల విలువైన హెరాయిన్‌ను సీజ్ చేశారు. లగేజీ బ్యాగులో దాచి డ్రగ్స్‌ను తరలించే ప్రయత్నం చేసింది ప్రయాణీకురాలు. దీంతో ఆమెను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది సదరు మహిళ. కెన్యాకు చెందిన నిందితురాలు.. లగేజ్ బ్యాగ్‌కు ఇరువైపులా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జేబుల ద్వారా డ్రగ్స్‌ను తరలించే ఏర్పాటు చేసింది. 

కాగా.. రెండు రోజుల క్రితం Goa నుండి డ్రగ్స్ తీసుకొస్తూ Hyderabad ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మహిళా Techie కూడా ఉన్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం Drugs తరలిస్తున్నారని పోలీసులు చెప్పారు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సీఐ చంద్రబాబు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు అందించారు. మంగళవారం నాడు సాయంత్రం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓ కారులో ఇద్దరు యువకులు ఒ మహిళ అనుమానాస్పదంగా తిరుగుతున్నారని సమాచారం ఆధారంగా తమ పోలీస్ బృందం  దాడులు నిర్వహించిందన్నారు.

Latest Videos

Also Read:హైద్రాబాద్‌లో డ్రగ్స్ తరలిస్తూ ముగ్గురి అరెస్ట్: నిందితుల్లో మహిళా టెక్కీ

కారులో ఉన్న మెహాదీపట్నం విజయనగర్‌కాలనీకి చెందిన మహ్మద్ జమీర్ సిద్దిఖ్, హఫీజ్‌పేట గోపాల్ నగర్ లోని నివాసం ఉంటున్న మహిళా టెక్కీ పులి Ramya , అల్మాస్ గూడ శేషాద్రినగర్ లో నివాసం ఉంటున్న కౌకుంట్ల Anilను అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు.  వీరి నుండి 9.4 గ్రాముల డ్రగ్స్ తో పాటు Ganjaని స్వాధీనం చేసుకొన్నామన్నారు.నిందితులు ఉపయోగించిన Carను కూడా సీజ్ చేశామన్నారు.ఈ ముగ్గురు కడా క్లబ్ హౌస్ అనే Online  యాప్ ద్వారా పరిచయమయ్యారన్నారు. హైద్రాబాద్ గచ్చిబౌలిలోని ఓ క్లబ్‌లో ఈ ముగ్గురు తరచు కలుసుకొనే వారని పోలీసులు చెప్పారు. కౌకుంట్ల అఖిల్ గోవా వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి తెచ్చేవాడని తమ దర్యాప్తులో తేలిందని సీఐ తెలిపారు. ఈ డ్రగ్స్ ను రమ్యకు సిద్దిఖ్‌కు ఇచ్చేవారని చెప్పారు.  నూతన సంవత్సర వేడుకల కోసం గోవా వెళ్లి వీరు ముగ్గురు డ్రగ్స్ కొనుగోలు చేశారని పోలీసులు తెలిపారు.

click me!