కరోనాకి కొత్త మందు.. పదివేల ప్యాకెట్ల పంపిణీ.. ఎలా తీసుకోవాలంటే..!

By telugu news teamFirst Published May 17, 2021, 8:02 AM IST
Highlights

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలసి డీఆర్డీవో ఆధ్వర్యంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ డెవలప్ చేశారు. 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది అవస్థలు పడుతుండగా...  వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సోకి ఆస్పత్రుల్లో చేరుతున్నవారిని కాపాడేందుకు వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే.. కరోనాకి ఇదే మందు అని చెప్పుకోవడానికి అయితే ఏదీ లేదనే చెప్పాలి. అయితే.. తాజాగా... కరోనాని అరికట్టేందుకు డీఆర్డీవో( డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) తీసుకువచ్చింది.

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలసి డీఆర్డీవో ఆధ్వర్యంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ డెవలప్ చేశారు. కాగా.. ఈ డ్రగ్ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్‌ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ఇటీవల  అనుమతి ఇచ్చింది. దీనికి 2- డి–అక్సీ -డి-గ్లూకోజ్ (2-డీజీ)గా పేరు పెట్టారు. ఇది సాచెట్​లలో పొడి రూపంలో దొరుకుతుంది. దీన్ని నీటిలో కరిగించి నోటి ద్వారా తీసుకోవాలి.  

కాగా.. ఈ మందుని ఇప్పుడు అధికారంగా నేటి నుంచి మార్కెట్లోకి తీసుకువచ్చారు.  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వీటిని విడుదల చేశారు.  దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆస్పత్రులకు ఈ మందును దాదాపు 10వేల ప్యాకెట్లు పంపిణీ చేశారు

తక్కువ నుంచి తీవ్రమైన లక్షణాలున్న పేషెంట్లకు ఈ మందు బాగా పని చేస్తుందని, పేషెంట్లు వేగంగా కోలుకోవడంతో పాటు ఆక్సిజన్‌‌‌‌పై అధారపడటాన్ని తగ్గిస్తుందని డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. గ్లూకోజ్‌‌‌‌ రూపంలోఉండే  2-డీజీ మందును దేశంలో ఈజీగా ఉత్పత్తి చేయొచ్చంది. వైరస్‌‌‌‌ వ్యాపించిన భాగాల్లోకి ఈ డ్రగ్ చేరి అక్కడి కణాల్లోని కరోనా శక్తిని అడ్డుకోవడంతో పాటు వైరస్ వ్యాప్తిని బాగా తగ్గిస్తుందని వివరించింది. సాధారణ ట్రీట్​మెంట్​తో పోలిస్తే ఈ డ్రగ్ తీసుకున్న వాళ్లు రెండున్నర రోజుల ముందే కోలుకున్నట్టు ట్రయల్స్​లో తేలిందని తెలిపింది. 

కిందటేడాది ఏప్రిల్​లో హైదరాబాద్​లోని సీసీఎంబీ సహకారంతో డీఆర్డీవో సైంటిస్టులు ఈ డ్రగ్ ప్రయోగాలు మొదలుపెట్టారని డిఫెన్స్ మినిస్ట్రీ చెప్పింది. సార్స్-కోవి-2 వైరస్‌‌‌‌పై ఇది బాగా పనిచేస్తుందని, వైరస్ పెరుగుదలను అడ్డుకుంటుందని క్లినికల్ ట్రయల్స్‌‌‌‌లో వెల్లడైందని వివరించింది. ఆ తర్వాత 2-డీజీ రెండో దశ ట్రయల్స్‌‌‌‌ 2020 మే నెల నుంచి అక్టోబర్ వరకు 11 హాస్పిటళ్లలోని 110 మంది పేషెంట్లపై జరిగాయని, దీన్ని తీసుకున్న కరోనా పేషెంట్లు త్వరగా కోలుకున్నారని వెల్లడించింది.

click me!