Israel: మన దేశం నుంచి ఇజ్రాయెల్‌కు 10 వేల మంది వర్కర్లు.. వచ్చే వారం నుంచి ప్రయాణం

By Mahesh K  |  First Published Jan 31, 2024, 6:36 PM IST

మన దేశం నుంచి ఇజ్రాయెల్‌కు పది వేల మంది కార్మికులు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. వచ్చే వారం నుంచి వారు బ్యాచ్‌ల వారీగా వెళ్లనున్నారు. ప్రతి బ్యాచ్‌లో 700 నుంచి 1000 మంది కార్మికులు ఉంటారు.
 


Israel: హమాస్‌ను తుడిచిపెట్టడమే లక్ష్యంగా ప్రకటించి ఇజ్రాయెల్ మొదలు పెట్టిన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ యుద్ధంలో 25 వేలకు మించి మరణాలు సంభవించాయి. ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ దేశంలో నిర్మాణ రంగం దాదాపుగా నిలిచిపోయింది. నిర్మాణ ప్రాజెక్టులు రద్దు కావడమో.. లేక వాయిదా పడటమో జరుగుతున్నది. పాలస్తీనా వర్కర్లపై నిషేధం విధించడం, అలాగే, యుద్ధ వాతావరణంతో భయకంపితులై విదేశీ వర్కర్లు ఇజ్రాయెల్ దేశం వదలడంతో.. అక్కడ నిర్మాణ రంగంలో కార్మికుల కొరత ఏర్పడింది.

ఈ లోటును పూడ్చడానికి ఇజ్రాయెల్ దేశం చర్యలు తీసుకుంది. వేరే దేశాల నుంచి కార్మికులను తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇజ్రాయెల్ అనుమతించే విదేశీ కార్మిక శక్తి పరిమితిని 30 వేల నుంచి 50 వేలకు పెంచింది. భారత్ నుంచి 10 వేల మంది కార్మికులను ఇజ్రాయెల్ దేశంలోకి తీసుకోవడానికి అనుమతులు ఇచ్చింది. 

Latest Videos

undefined

Also Read : Gaddar: ప్రజా గాయకుడు గద్దర్‌కు పవన్ కళ్యాణ్ నివాళి.. ‘గద్దర్ చివరిక్షణాల్లో నా నాయకత్వం గురించి.. ’

ఇందులో భాగంగానే భారత్ నుంచి పదివేల మంది కార్మికులు ఇజ్రాయెల్‌కు ఉపాధి నిమిత్తం వలస కార్మికులుగా వెళ్లడానికి సిద్ధం అయ్యారు. వచ్చే వారం నుంచి 700 నుంచి 1000 మంది కార్మికుల బ్యాచ్‌లను వారం చొప్పున ఇజ్రాయెల్‌కు వస్తారని ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్ వర్గాలు వార్తా ఏజెన్సీ పీటీఐకి తెలిపాయి. వచ్చే వారం నుంచి వారు ఇజ్రాయెల్‌కు వస్తారని అనుకుంటున్నామని పేర్కొన్నాయి.

click me!