మద్యం అమ్మకాలకు అనుమతివ్వాలని భారత ఆల్కహాలిక్ బ్రేవరేజ్ కంపెనీల సమాఖ్య (సీఐఏబీసీ) పది రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసింది.
న్యూఢిల్లీ: మద్యం అమ్మకాలకు అనుమతివ్వాలని భారత ఆల్కహాలిక్ బ్రేవరేజ్ కంపెనీల సమాఖ్య (సీఐఏబీసీ) పది రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసింది.
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాల మూసివేత కారణంగా అక్రమంగా మద్యం విక్రయాలు చోటు చేసుకొంటున్నాయని సీఐఏబీసీ అభిప్రాయపడింది. సీఐఏబీసీ కమిటి సోమవారం నాడు మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసింది.
మద్యం విక్రయాలను నిలిపివేయడంతో దేశంలో పలు చోట్ల అక్రమంగా మద్యం విక్రయాలు చోటు చేసుకొంటున్నట్టుగా వార్తలు వచ్చిన విషయాన్ని సీఐఏబీసీ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి ఆ లేఖలో ప్రస్తావించారు.
అక్రమ మద్యం విక్రయాల కారణంగా ప్రజల ప్రాణాలకు కూడ ముప్పుందన్నారు. మద్యం లైసెన్సుల గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించాలని కూడ ఆయన ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
also read:ఢిల్లీలో కరోనా వ్యాప్తి చేస్తారా అంటూ ఇద్దరు మహిళా డాక్టర్లపై దాడి:ఒకరి అరెస్ట్
రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుల్లో మద్యం కూడ ఒకటి అని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మద్యం దుకాణాలు మూసివేయడం ద్వారా ఆదాయాన్ని కోల్పోతారని ఆయన అభిప్రాయపడ్డారు.కొందరు వ్యక్తులకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మద్యం అవసరం ఉంటుందన్నారు.
మద్యం దొరకని కారణంగా మందుబాబులు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో హైద్రాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో మద్యానికి బానిసలైన రోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే.