లాక్ డౌన్ పై ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఈ నెల 30 వరకు పొడగింపు

By telugu news teamFirst Published Apr 9, 2020, 12:34 PM IST
Highlights

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడగింపే అసలైన మార్గమంటూ స్పష్టం చేశాయి. అయితే.. దీనిపై ఇప్పటి వరకు ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై ప్రకటించే అవకాశం ఉంది.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ప్రస్తుతం దేశంలో విలయ తాండవం చేస్తోంది. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ..కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కాగా... ప్రస్తుతం విధించిన లాక్ డౌన్.. మరో వారం రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో.. లాక్ డౌన్ కొనసాగిస్తారా..? లేదా ఇంతటితో ముగింపు పలుకుతారా అనే విషయం పై తీవ్ర ఆసక్తి నెలకొంది.

Also Read 14న లాక్ డౌన్ ఎత్తేసే ఆలోచన లేదు: ప్రధాని నరేంద్ర మోడీ...

ఈ విషయంపై ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడగింపే అసలైన మార్గమంటూ స్పష్టం చేశాయి. అయితే.. దీనిపై ఇప్పటి వరకు ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై ప్రకటించే అవకాశం ఉంది.

అయితే.. ఈలోగా.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రంలో లాక్ డౌన్ ని ఈ నెల 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రకటన చేశారు. కాగా... ఈ విషయంలో నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. మరి ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మద్తు ఇస్తూ.. మరిన్ని రాష్ట్రాలు ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

click me!