రిజర్వేషన్లకు నెహ్రు వ్యతిరేకం: రాజ్యసభలో మోడీ

By narsimha lode  |  First Published Feb 7, 2024, 3:17 PM IST

కాంగ్రెస్ పార్టీపై  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు.  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోడీ సమాధానం చెప్పారు. 



న్యూఢిల్లీ: ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఆనాడు నెహ్రు వ్యతిరేకించారని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేశారు.కావాలంటే రికార్డులను చూడాలని ఆయన కాంగ్రెస్ ను కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు  రాజ్యసభలో  బుధవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  సమాధానం చెప్పారు.

also read:దేశాన్ని విభజించే కుట్రలను సహించలేం: రాజ్యసభలో కాంగ్రెస్‌పై మోడీ

Latest Videos

undefined

అంబేద్కర్ లేకుంటే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కేవి కావన్నారు.రిజర్వేషన్లకు తాను వ్యతిరేకమని అప్పట్లో సీఎంలకు నెహ్రు లేఖ రాశారన్నారు. ఈ లేఖ రికార్డుల్లో కూడ ఉందన్నారు.ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు దక్కితే  ఉద్యోగాల్లో నైపుణ్యత దెబ్బతింటుందని నెహ్రు చెప్పారన్నారు.

also read:నాడు ఎడమకాల్వపై, నేడు కృష్ణా ప్రాజెక్టులపై: పోరాటానికి కేసీఆర్ ప్లాన్

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు లభిస్తే ప్రభుత్వ పని ప్రమాణాలు పడిపోతాయని నెహ్రు చెప్పారన్నారు. ఇలాంటి ఉదహరణలతో  మీ మనస్తత్వం అర్ధం చేసుకోవచ్చని  కాంగ్రెస్ పై మోడీ విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు.  ఎస్‌సీ, ఎస్టీ వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా  కాంగ్రెస్ వ్యవహరం ఉంటుందని ఆయన విమర్శలు గుప్పించారు. కానీ,తమ పార్టీ ఎప్పుడూ  వారికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

also read:ఢిల్లీకి బాబు: మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపుపై పార్టీ నేతలతో చర్చ

తొలుత దళితులు, ఇప్పుడు ఆదీవాసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మన పథకాల లబ్దిదారులు ఎవరు ఎవరని ఆయన ప్రశ్నించారు. ఎస్‌సీ, ఎస్టీ,  ఓబీసీ వర్గాల కోసం  తమ పథకాలు ఉద్దేశించినట్టుగా ఆయన  పేర్కొన్నారు.

click me!