శ్వేతపత్రం అంటే ఏమిటి? దాని చరిత్ర, ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెడుతుంది?

By SumaBala Bukka  |  First Published Feb 7, 2024, 2:04 PM IST

చట్టపరమైన ప్రతిపాదనలకు… బిల్లు రూపం ఇవ్వడానికి ముందు జరిగే వ్యవహారాలపై  ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రభుత్వ నివేదికగా శ్వేత పత్రాన్ని నిర్వచిస్తారు. 


ఢిల్లీ : ఏదైనా ఒక అంశంపై ప్రభుత్వం  విడుదల చేసే సాధికారిక నివేదిక  లేదా మార్గదర్శక పత్రాన్ని శ్వేత పత్రం అంటారు.  ఇందులో ఆ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు  ఉంటాయి.  ప్రభుత్వ అధికారిక సమాచారంతో రూపొందించే వాస్తవ నివేదికనే  శ్వేతపత్రం అంటారు.  ఏదైనా ఒక అంశం మీద ప్రభుత్వం తన విధానాలను చెబుతూ..  దాని మీద అభిప్రాయాలను ఆహ్వానించడానికి  శ్వేత పత్రాన్ని ఉపయోగించవచ్చు.ఒక బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు దానికి సంబంధించిన వివరాలను శ్వేత పత్రం ద్వారా విడుదల చేసి ప్రజలకు.. సమాచారాన్ని  అందించడానికి ఉపయోగిస్తారు. 

ఈ శ్వేత  పత్రాన్ని 1922లో చర్చిల్ ప్రభుత్వం విడుదల చేసింది.  ఆ సమయంలో చర్చిలు ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికను  మొట్టమొదటిసారిగా శ్వేత పత్రం అని పిలిచారట.  దీనినే చర్చిల్ మెమోరాండం  అంటారు. ఇది ముసాయిదా పత్రంగా ఉంది. ఇందులో యూదులపై  పాలస్తీనా హింసపై  ఆ దేశంలోని తొలి బ్రిటిష్ హై కమిషనర్ సర్ హెర్బర్ట్ శామ్యూల్  ఈ ముసాయిదా పత్రాన్ని రూపొందించారు.

Latest Videos

చట్టపరమైన ప్రతిపాదనలకు… బిల్లు రూపం ఇవ్వడానికి ముందు జరిగే వ్యవహారాలపై  ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రభుత్వ నివేదికగా శ్వేత పత్రాన్ని  బ్రిటన్ పార్లమెంట్ నిర్వచించింది.  బ్రిటన్ నిర్వచించిన ఈ శ్వేత పత్రాన్ని భారత్, కెనడా, అమెరికా లాంటి దేశాలు అనుసరిస్తున్నాయి.  ఇప్పటికి  పాలన వ్యవహారాల్లో శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నాయి.

ఈ శ్వేత పత్రాల వల్ల ప్రభుత్వ పనితీరును ప్రజలు అవగాహన చేసుకోవడానికి,  వీలైన సూచనలు చేయడానికి అవకాశం ఉంటుంది.  ప్రభుత్వ విధాన నిర్ణయాలు,  అంశాల గురించి ప్రజలకు తెలుస్తుంది. . ఇక కొన్ని దేశాల్లో ఈ శ్వేత పత్రంతో పాటు గ్రీన్ పేపర్ కూడా విడుదల చేస్తారు.  గ్రీన్ పేపర్ను శ్వేత పత్రం కంటే ముందే విడుదల చేస్తారు.  శ్వేత పత్రానికంటే ముందు ప్రభుత్వం విడుదల చేసే సూత్రప్రాయ నివేదికను గ్రీన్ పేపర్ అంటారు.  దీంట్లో ఒక అంశానికి సంబంధించిన ప్రభుత్వం ప్రతిపాదనలు,  చర్చల సారాంశం,  ఇతర సలహాలు ఉంటాయి.

ఇక ఇప్పటికి వస్తే.. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే యూపీఏ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై కేంద్రం శ్వేతపత్రం సమర్పించనుంది. ఏఎన్ఐ సమాచారం ప్రకారం, “ఈ శ్వేతపత్రం దేశ ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థపై దాని దుష్ప్రభావాల గురించి మరింత వివరంగా తెలియజేస్తుంది. అదే సమయంలో నిర్మాణాత్మక చర్య తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను చర్చిస్తుంది.

రాజ్యసభలో ధన్యవాద తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా సమాధానం ఇవ్వనున్నారు. పదవీ విరమణ చేయనున్న 56 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు ఇవ్వనున్నారు. దీనికోసం పార్లమెంట్ సెషన్‌ను ఒక రోజు పొడిగించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, త్వరలో పార్లమెంటుకు శ్వేతపత్రాన్ని సమర్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆమె మాట్లాడుతూ. "అనైతికంగా ఉన్న ప్రతిదీ శ్వేతపత్రంలో కవర్ చేస్తామని తెలిపారు. సరైన నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు ఎలా లాభం కలిగిస్తోందో చెబుతామని’ ఆమె పేర్కొంది.

"మనం పది అద్భుతమైన సంవత్సరాలను కోల్పోయాం. గనుల నుండి బ్యాంకుల వరకు ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని ఈ పదేళ్ల కాలంలో సమస్యలు పీడిస్తున్నాయి" అని సీతారామన్ అన్నారు. ప్రజలు తమపై లేదా దాని సంస్థలపై విశ్వాసం కోల్పోకూడదని ప్రభుత్వం కోరుకోవడం వల్ల శ్వేతపత్రాన్ని విడుదల చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని ఆమె పేర్కొన్నారు. మొదట ప్రధానమంత్రి ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించారు. అందుకే శ్వేతపత్రం ఆలస్యం అయింది ”అని ఆమె పేర్కొంది.

ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ 2014 వరకు దేశం ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉందో శ్వేతపత్రం తెలుపుతుంది అన్నారు. 

click me!