మా ఇంట్లోని బోర్లన్నీ ఎండిపోయాయి: కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్

By narsimha lode  |  First Published Mar 6, 2024, 1:55 PM IST

బెంగుళూరులో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. నగరంలోని బోర్లు ఎండిపోయాయి.దరిమిలా నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


బెంగుళూరు: తన ఇంట్లో కూడ బోర్ వెల్ ఎండిపోయిందని  కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ చెప్పారు. బుధవారంనాడు కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ మీడియాతో మాట్లాడారు. బెంగుళూరులో నీటి ఎద్దడి నివారణకు  కర్ణాటక ప్రభుత్వం  యుద్దప్రాతిపదికన పనిచేస్తుందన్నారు. బెంగుళూరులో సుమారు మూడు వేల బోర్లు ఎండిపోయాయని శివకుమార్ చెప్పారు. తన నివాసంలో ఉన్న అన్ని బోర్ బావులు ఎండిపోయాయని డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్పారు.

also read:భారత్‌లో పుట్‌పాత్ పై కూరగాయలు విక్రయించిన రష్యన్ యువతి: వీడియో వైరల్

Latest Videos

నగరంలోని  నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.ఈ విషయమై అధికారులతో సమావేశాలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మేకేదాటు ప్రాజెక్టుకు కేంద్రం సహాయం చేయకపోవడాన్ని డి.కె. శివకుమార్  తప్పుబట్టారు.  

also read:మలివిడత జాబితా: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కసరత్తు

చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నామన్నారు.  మేకేదాటు ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మేకేదాటు సమస్య పరిష్కరమయ్యేలా చూస్తుందని ఆశిస్తున్నట్టుగా  డి.కె. శివకుమార్ చెప్పారు.

also read:పార్లే-జి నుండి చాక్లెట్ ఫ్లేవర్‌తో బిస్కట్?: నెట్టింట చర్చ, మీమ్స్

కర్ణాటకలోని కావేరి బేసిన్ లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మేకేదాటు ప్రాజెక్టు ఒక్కటే పొరుగు రాష్ట్రాలతో నీటి వివాదానికి పరిష్కారమని శివకుమార్ గత ఏడాది చెప్పారు.బెంగుళూరు నగరంలో  నీటి ఎద్దడి కారణంగా  నీటి ట్యాంకర్లకు  పెద్ద ఎత్తున  డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో  5000 లీటర్ల ట్యాంకర్ కు రూ. 500 చార్జీ వసూలు చేసేవారు. ప్రస్తుతం 5000 లీటర్ల ట్యాంకర్ కు  ప్రస్తుతం రూ. 2 వేలు వసూలు చేస్తున్నారు.

also read:స్కార్పియో వాహనంలో 18 ప్రయాణం: ఇంటర్నెట్‌లో వైరలైన వీడియో

అయితే ట్యాంకర్ల యజమానులతో చర్చించి ప్రజలందరికి ఆమోదయోగ్యమైన ధరను నిర్ణయిస్తామని డి.కె.శివకుమార్ హామీ ఇచ్చారు.  ఈ నెల 7వ తేదీలోపుగా  ట్యాంకర్ల యజమానులు తమ వివరాలను నమోదు చేయకపోతే  బోర్లను సీజ్ చేస్తామని  డి.కె. శివకుమార్ వార్నింగ్ ఇచ్చారు.బెంగుళూరుకు 15 కి.మీ. దూరంలోని నీటి వనరులను వినియోగించుకొని  నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించినట్టుగా ఆయన చెప్పారు. 

 

click me!