ఇండియాలో రష్యన్ యువతి కూరగాయలు విక్రయిస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
న్యూఢిల్లీ: భారతదేశంలో పుట్ ఫాత్ పై రష్యన్ అమ్మాయి కూరగాయలు అమ్ముతున్నట్టుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మేరీ అనే రష్యన్ యువతి ఇండియాలో పుట్ పాత్ పై కూరగాయలు విక్రయిస్తున్న వ్యక్తితో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.
పార్లే-జి నుండి చాక్లెట్ ఫ్లేవర్‌తో బిస్కట్?: నెట్టింట చర్చ, మీమ్స్also read:
మరియా చుగురోవా ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్టు చేశారు. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు విక్రయించే స్థానిక కూరగాయల వ్యాపారితో మేరీ మాట్లాడారు. నమస్తే భయ్యా కూరగాయలు ఎలా విక్రయించాలో తనకు నేర్పించాలని కూరగాయల వ్యాపారిని ఆమె కోరారు. ఇందుకు కూరగాయల వ్యాపారి అంగీకరించారు.
కూరగాయలను ఎలా విక్రయించాలనే విషయాన్ని రష్యన్ యువతికి అతను నేర్పించారు.
also read:అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ప్రారంభం: విద్యార్థులతో మెట్రోలో మోడీ ప్రయాణం
వినియోగదారులను కూరగాయలు కొనేలా ఎలా మెప్పించాలనే దానిపై రష్యన్ యువతికి వ్యాపారి మెళకువలు నేర్పించారు.కూరగాయలు కొనేందుకు వచ్చిన వినియోదారులతో రష్యన్ యువతి చిరునవ్వుతో పలకురించారు. వినియోగదారులకు బంగాళాదుంపలను విక్రయించినట్టుగా ఆ వీడియోలో ఉంది.
also read:స్కార్పియో వాహనంలో 18 ప్రయాణం: ఇంటర్నెట్‌లో వైరలైన వీడియో
కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులు బేరమాడారు. ఈ విషయాన్ని మేరీ వివరించారు. ఇండియాలో బేరసారాలుఆడడం ముఖ్యమైన భాగంగా ఆమె పేర్కొన్నారు.తక్కువ ధరకు కూరగాయలను వినియోగదారులు ఎలా కొనుగోలు చేస్తారో మేరీ వివరించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కూరగాయలను విక్రయించిన రష్యన్ యువతిని నెటిజన్లు అభినందించారు. రష్యన్ యువతి ప్రయత్నాన్ని నెటిజన్లు ప్రశంసించారు.
also read:మలివిడత జాబితా: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కసరత్తు
భారతీయ సంస్కృతిని మనకంటే రష్యన్ యువతి ఎక్కువగా ఆస్వాదించే విధానాన్ని తాను ప్రేమిస్తున్నానని మరొకరు రాశారు.ఫిబ్రవరి 24న షేర్ చేసిన వీడియోకు 15 మిలియన్లకు పైగా మంది వీక్షించారు.