Sorghum bread : జొన్న రొట్టెలతో ఉపయోగాలెన్నో..

By Mahesh RajamoniFirst Published Jan 22, 2022, 11:41 AM IST
Highlights

 Sorghum bread :మారుతున్న కాలంతో పాటుగా మనుషుల ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. నేటికీ నేటికి ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు జొన్నలు, రాగులతో రొట్టెలు చేసుకుని తినేవారు. ఇప్పుడు అల్కగా అయ్యే చపాతీలను చేసుకుని తింటున్నారు. కానీ చపాతీల కంటే జొన్న రొట్టెలే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎలాగంటే..

 Sorghum bread : కాలంతో పాటుగా మనుషుల అలవాట్లు కూడా మారుతున్నాయి. అందులో ఆహారపు అలవాట్లలో మరెన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నాడు మన పెద్దలు తిన్న ఆహారం ఇప్పుడు లేదు. కానీ కరోనా రాకతో జనాలు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. అంటే ఎనకటి రోజుల్లో ఎక్కువగా తిన్న ఆహారం వైపు మళ్లుతున్నారన్నమాట. అలాంటి వంటకాలనే వండుకుని తినడానికి ఎక్కువుగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆ ఆహారమే ఎంతో బలవర్ధకమైంది కాబట్టి. అందులో జొన్న రొట్టే మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే ప్రస్తుతం చపాతీలు తినే వారు కూడా జొన్న రొట్టెలనే తినడానికి ఇష్టపడుతున్నారు. ఈ కష్టకాలంలో బలమైన ఆహారమే మనకు శ్రీరామ రక్ష కాబట్టి. 

జొన్న రొట్టెల్లో ఎన్నో పోషక విలువలుంటాయి. షుగర్ పేంషెంట్లకు జొన్న రొట్టే ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ రొట్టెతో శరీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఈ రొట్టె ఎంతో సహాయపడుతుంది. ఈ రొట్టెలో కాల్షియం, యాంటి ఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ బి వంటివి పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు చర్మానికి కూడా మేలు చేస్తుంది. జుట్టు ఒత్తుగా, బలంగా ఉండేందుకు కూడా ఈ జొన్న రొట్టే ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎముకలు బలంగా ఉండేందుకు ఈ రొట్టె దివ్య ఔషదంలా పనిచేస్తుంది. 

నరాల బలహీనతతో బాధపడేవారు రోజుకు ఒక్క జొన్న రొట్టె తిన్నా చాలు. ఈ సమస్య నుంచి తొందరగా బయటపడొచ్చు. అంతేకాదు రోగ నిరోధక శక్తి (Immunity)ని పెంచడంలో ముందుంటుంది.  కంటి చూపు మందగించిన వారు ఈ రొట్టెలను రోజూ తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. మతిమరుపు ఉన్న వాళ్లకు కూడా ఈ రొట్టెలు ఎంతో మేలు చేస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తమ రోజు వారి ఆహారంలో జొన్నలతో తయారుచేసిన ఆహారాన్ని తీసుకుంటే అధిక బరువును ఈజీగా కోల్పోవచ్చు. అయితే ఈ రొట్టెలను తయారుచేయడం చాలా కష్టమైన పని అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ రొట్టెలు చేయడం చాలా సులవు. 
 
జొన్నరొట్టెలను తయారు చేసే విధానం..

మొత్తం జొన్నలను  లేదా జొన్నల్లో మోతాదులో బియ్యం పోసి కూడా పిండి పట్టించుకోవచ్చు. అయితే ఎన్ని రొట్టెలు చేయాలనుకుంటున్నారో అందుకు కావాల్సిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. కొంచెం పిండిని పక్కకు జరిపి అందులో కొన్ని నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా కలుపుకోండి. ఆ తర్వాత దాన్ని చపాతీ కంటే కొంచెం పెద్ద సైజుల్లో ఉండే విధంగా బాల్స్ లా చేసి చపాతీ చేసే పీటపై పెట్టి చేతితో పెద్దగా అయ్యే వరకు నొక్కాలి. ఆ తర్వాత వాటిని వేడి వేడి పెనం వేసి రెండు వైపులా మంచిగా కాల్చాలి. ఇంకేముంది ఆ రొట్టెను వేడి వేడిగా ఏదైనా కూరతో తినేయొచ్చు.  


 

click me!