పని మీద ఏకాగ్రత తగ్గుతుందా? అయితే ఈ ఫుడ్ ను తినండి..

By Mahesh RajamoniFirst Published Jan 21, 2022, 5:07 PM IST
Highlights

ఏ పని శ్రద్ధతో చేయలేకపోతున్నా.. మధ్యలోనే పని మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందని బాధపడేవారు మీ ఆహారంపై  Concentrate చేయండి. ఎందుకంటారా.. ఏకాగ్రతను పెంచడానికి, పనిపట్ల శ్రద్ద ఉండటానికి ఈ ఆహారం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి.
 

ఏ పని శ్రద్ధతో చేయలేకపోతున్నా.. మధ్యలోనే పని మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందని బాధపడేవారు మీ ఆహారంపై  Concentrate చేయండి. ఎందుకంటారా.. ఏకాగ్రతను పెంచడానికి, పనిపట్ల శ్రద్ద ఉండటానికి ఈ ఆహారం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి.

ఆహారం శరీరానికి ఎనలేని శక్తిని అందించడంలో ముందుంటుంది. అలాగే బరువు తగ్గడానికి, పెరగడానికి, ఆయుష్షు పెరగడానికి, శరీర సామర్థ్యం, గుండె ఆరోగ్యం, అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలిసిందే. కానీ మనం తీసుకునే ఆహారం శరీరానికే కాదు. మెదడుకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆహారం మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని చాలా తక్కువ మందికే తెలుసు. దానితో పాటు మీరు తీసుకునే ఫుడ్ మీ మనసుపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. కాగా వయస్సు మీద పడుతున్న కొద్ది అనేక అనారోగ్య సమస్యలు రావడం, తరచుగా అలసటగా అనిపించడం, మనసు ఏకాగ్రత తప్పడం వంటివి జరుగూ ఉండటం చాలా సహజం. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు మీ మెదడు చురుగ్గా పనిచేసేలా చేయడంతో పాటుగా మీ మనసు ఏకాగ్రత గా ఉండటానికి ఎంతో ఉపయోగపడతాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

1. ఏకాగ్రతను పెంచడంలో కెఫిన్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది పొద్దు పొద్దున్నే కాఫీని తాగుతుంటారు. కాఫీని తో మగత దెబ్బకు పరుగందుకుంటుంది. నిస్సత్తువ పారిపోయి సరికొత్త ఉత్తేజం సంతరించుకుంటుంది. అలాగే కాఫీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. అలాగే మనసు కుదురుగా ఉండేందుకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఒక్క కాఫీనే కాదు డార్క్ చాక్లెట్లలో కూడా కెఫిన్ ఉంటుంది. అయితే వీటిని మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. అదే లాభాలున్నాయని మితిమీరి తింటే లాభాలు సంగతి పక్కన పెడితే తీవ్ర స్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
2. మెదడును చురుకుగా శక్తివంతంగా చేయడంలో చక్కెర ముందుంటుంది. చక్కెర అంటే టీలల్లో వేసేది కాదండి.. మనం తీసుకునే  ఆహారాల్లో లభించేది. పిండి పదార్థాలు, చర్కెర నుంచి వచ్చే గ్లూకోజే మెదడుకు శక్తినిచ్చేది. పనిపట్ల ఏకాగ్రత లేకపోతే.. ఒక గ్లాసు పండ్ల రసం తాగితే అంతా సెట్ అవుతుంది. వీటిల్లో ఉండే సహజ చక్కెర బ్రెయిన్ ను చురుగ్గా చేస్తుంది. అలాగే వీటి వల్ల మానసిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. తీపి మంచి చేస్తుందని తీపి పానియాలను మితిమీరి తాగితే అనారోగ్యం పాలవడం పక్కాగా జరుగుతుంది. అందుకే సహజ చక్కెరలు లభించే పండ్ల రసాలనే ఎక్కువగా తాగండి. 

3. చేపలు కూడా ఏకాగ్రతను పెంచడంలో ముందుంటాయి. వీటిలో దండిగా ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. ఒమెగా 3 పుష్కలంగా లభించే చేపలను తినే వారిలో పక్షవాతం, మేధోశక్తి తగ్గడం, డిమోన్షియా వంటి సమస్యలు చాలా తక్కువగా వస్తాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ కొవ్వులు Memoryని పెంచడంలో ముందుంటాయి. అందుకే చురుకైనా మెమోరి పవర్ కోసం, ఏకాగ్రత కోసం వీటిని వారానికి కనీసం రెండు సార్లైనా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

click me!