Medaram Jathara: సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు వేళాయరా..

By Mahesh RajamoniFirst Published Jan 21, 2022, 11:12 AM IST
Highlights

Medaram Jathara: సకల సౌభాగ్యాలను ప్రసాధించే వన దేవతలు సమ్మక్క, సారలమ్మ మహా జాతర అతి కొద్ది రోజుల్లోనే షురూ కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఈ వనదేవతల మహా జాతర జరుగనుంది. 18 న భక్తులు మొక్కులు తీర్చుకునే కార్యక్రమం, 19న అమ్మవార్ల వన ప్రవేశంతో ఈ జాతర ముగుస్తుంది. 

Medaram Jathara: సకల సౌభాగ్యాలను ప్రసాధించే వన దేవతలు సమ్మక్క, సారలమ్మ మహా జాతర అతి కొద్ది రోజుల్లోనే షురూ కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఈ వనదేవతల మహా జాతర జరుగనుంది. 18 న భక్తులు మొక్కులు తీర్చుకునే కార్యక్రమం, 19న అమ్మవార్ల వన ప్రవేశంతో ఈ జాతర ముగుస్తుంది. 

 కోరిన వరాలను ఇచ్చే వన దేవతల మహా జాతర మొదలు కానుంది. ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం మహా జారతకు రాష్ట్రం నలుమూలల ప్రజలే కాదు.. వేరే దేశాల ప్రజలు నుంచి సైతం ఈ అమ్మవారులను దర్శించుకోవడానికి క్యూలు కడుతుంటారు. మేడారంలో కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మల వనదేవతల జాతర తాడ్వాయి మండలంలో ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహిస్తారు. 2022 లో జరిగే మేడారం మహా జారత తేదీలను సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం పూజారుల సంఘం ప్రకటించింది. 

విగ్రహాలు లేని అతిపెద్ద జాతర మేడారం జాతర. ఈ మహా జారత భారత దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రత్యేక గుర్తింపు పొందింది. గిరిజనుల ఆచారాలను, సంప్రదాయాలను ఈ సమ్మక్క, సారలమ్మ జాతర ప్రతిభింబింపజేస్తుంది. దేశం నలుమూలల నుంచి కోట్ల జనం తరలివచ్చే ఏకైక జాతర ఇది.  ప్రతి రెండేండ్ల కోసారి నిర్వహించే ఈ మహా జాతర మాఘ శుద్ద పౌర్ణమి రోజున మొదలవుతుంది. ఆ రోజు నుంచి మొదలై నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది.  కుంభమేళ తర్వాత కోట్ల జనం తరలివచ్చే ఏకైక జాతరగా మేడారం గుర్తించబడింది. 

అందుకే భక్త జనాలకు ఎటువంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను ఏర్పాటు చేస్తోంది. ఈ జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసారు. కాగా కరోనా  విజృంభిస్తున్నవేళ రాష్ట్రప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టమైన చర్యలను తీసుకోనుంది. జాతరకు కావాల్సిన అన్ని ప్రణాళికలను సిద్దం చేసే పనిలో పడింది. కాగా ఆ జాతరకు ఇప్పటికే రూ.75 కోట్లను కేటాయించినట్టుగా తెలంగాణ రాష్ట్ర మంతి సత్యవతి రాథోడ్ తెలియజేశారు. 

అయితే జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. అలాగే మాస్కులు తప్పనిసరిగా ధరించే రావాలని ఆమె సూచించారు. దాంతో పాటుగా ప్రభుత్వం తరఫున కూడా జాతరలో మాస్కులు పంచుతామని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఈ జాతరకోసం 8 వేలకు పైగా ఆర్టీసీ బస్సులను ఏర్పటు చేస్తున్ననట్టుగా ఆమె తెలియజేశారు. అయితే అన్ని బాగుంటే సీఎం కేసీఆర్ కూడా ఈ జాతరకు వెళ్లనున్నట్టు సమాచారం.  

click me!