పనసతో మగవారిలో ఆ సమస్యకు పరిష్కారం

Published : Aug 03, 2018, 03:24 PM IST
పనసతో మగవారిలో ఆ సమస్యకు పరిష్కారం

సారాంశం

పనస తొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీర్యవృద్ధిని కలిగించి, అంగస్తంభన సమస్యల్ని తగ్గించి శృంగారంలో అధిక ఆనందం కలిగించేలా చేస్తుంది.

పనసపండు ఇష్టపడని వారం సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. పనస పండు సంపూర్ణమైన మరియు బలవర్దకమైన ఆహారం. ఇందులో విటమిన్ ఎ, సి, బి6తో పాటు ధియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్ మరియు ఫైబర్‌ను సమృద్ధిగా కలిగి ఉంది. ఈ పనసను తీసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందట. మరి అవేంటో చూసేద్దామా..

పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి.

పనస తొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీర్యవృద్ధిని కలిగించి, అంగస్తంభన సమస్యల్ని తగ్గించి శృంగారంలో అధిక ఆనందం కలిగించేలా చేస్తుంది.

ఇది శరీరంలోని రోగ నిరోధరక శక్తిని పెంచుతుంది. శరీరంలోని అనేక రుగ్మతల బారినుండి కాపాడుతుంది. అంతేకాకుండా ఇది ప్రేగు మరియు లంగ్స్ క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలతో పోరాడి డి.ఎన్.ఎ ను డ్యామేజీ బారి నుండి కాపాడుతుంది.

ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పి మరియు గుండె పోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది.

పనస పండు షుగర్ వ్యాధి ఉన్నవారికి మంచి ఆహారం. ఈ పండు తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్ లెవల్ పెరిగేలా చేస్తుంది.

ఇందులో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మం మరియు జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది.

రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు మంచి ఫలితాన్నిస్తుంది. పనసపండులో ఉండే పోషకాలు మరియు విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.

PREV
click me!

Recommended Stories

ఒత్తిడిని తగ్గించే ఆహారాలు ఇవి..
Hair Growth: జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగాలంటే.. వీటిని రెగ్యులర్ గా తింటే చాలు!