తాజా పండ్లు, కూరగాయల నుంచి తీసిన జ్యూస్ లలో మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.అవి శరీరంలోని కొవ్వు పదార్థాలు కరిగిస్తాయి
సన్నగా, నాజుకుగా, అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.బరువు తగ్గడానికి చాలా మంది చాలా చేస్తుంటారు. తిండి మానేసి కడుపు మాడ్చుకుంటారు. అయితే.. తిండి మానేయకుండా చక్కగా జ్యూసులు తాగి కూడా బరువు తగ్గవచ్చు. కొందరు డాక్టర్లు చెబుతుంటారు.. జ్యూస్ లకన్నా.. పండ్లు తింటేనే మంచిది. అందులో పీచుపదార్థాలు ఉంటాయి. కాబట్టి కొవ్వును కరిగిస్తాయి అని. అదీ కొంత వరకు నిజమే. కానీ.. ఈ పండ్లు, కూరగాయలు మాత్రం జ్యూస్ రూపంలో తీసుకుంటేనే బరువు తగ్గుతారు. మరి అవేంటో చూద్దామా..
తాజా పండ్లు, కూరగాయల నుంచి తీసిన జ్యూస్ లలో మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవి శరీరంలోని కొవ్వు పదార్థాలు కరిగిస్తాయి. అంతే కాకుండా మెటాబాలిజాన్ని మెరుగు పరుస్తుంది. తద్వారా కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. మీరు రోజు తీసుకునే ఆ హారంలో ఈ జ్యూస్ లను కూడా చేర్చండి. ఫలితం మీకే తెలుస్తుంది.
కాకరకాయ జ్యూస్..
కాకరకాయ చేదుగా ఉండటం వల్ల చాలా మంది దానిని ఇష్టపడరు. కానీ.. నిజంగా రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే బరువు సులభంగా తగ్గుతారు.ఇందలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉండదు. 100గ్రాముల క్యారెట్ లో కేవలం 17 కేలరీలు మాత్రమే ఉంటాయి.
క్యారెట్..
క్యారెట్ జ్యూస్ బరువు తగ్గడానికి చాలా సహాయం చేస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువగానూ, పీచు పదార్థం ఎక్కువగానూ ఉంటుంది. ఉదయం పూట ఒక పెద్ద గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే.. మళ్లీ భోజనం సమయం వరకు మీకు ఆకలి కూడా వేయదు. అంతేకాకుండా అందులోని ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ క్యారెట్ తో సగం యాపిల్, సగం నారింజ, కొంచెం అల్లం కలిపి మొత్తం కలిపి జ్యూస్ చేసుకోని తాగితే మరింత ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.
కీరదోస జ్యూస్..
వేసవి కాలం వచ్చిదంటే చాలు..మనలో చాలా మంది ఇవి తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే.. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. నీరు , ఫైబర్ ఎక్కువగా ఉండటంతో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి.. ఇది కూడా బరువు తగ్గించేందుకు దోహదపడుతుంది. కొంచెం తీసుకుంటే చాలు కడుపు త్వరగా నిండిపోతుంది.
ఉసిరి జ్యూస్..
రోజు ఉదయాన్నే ఉసిర జ్యూస్ తాగితే.. చాలా మంచిది. ఇది మీ డైజెషన్ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగించేందుకు త్వరగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ మార్కెట్ లోనూ బాటిల్స్ రూపంలో లభ్యమౌతుంది.
దానిమ్మ జ్యూస్..
ఈ జ్యూస్ తాగితే.. రక్తం పడుతుందనే ఇప్పటి వరకు చాలా మందికి తెలుసు. కానీ.. ఇది బరువు తగ్గించేందుకు కూడా సహాయం చేస్తుంది. అంతేకాదు.. ఈ జ్యూస్ తాగితే.. చర్మం కాంతి వంతంగా అందంగా తయారువుతంది. దీనిలోనూ కొవ్వు శాతం ఉండదు.
క్యాబేజీ జ్యూస్..
అన్ని కూరగాయలన్నింటిలోనూ.. ఫైబర్ ఎక్కువగా క్యాబేజీలో ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వున కరిగించేందుకు సహాయం చేస్తుంది.ఇది ఆకలిని నియంత్రిస్తుంది. ఈ జ్యూస్ తాగితే ఎక్కువగా సేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ లో ఉంటాం. దీనిని ఆపిల్, నిమ్మ లేదా క్యారెట్, బీరూట్ వంటివి కలిపి జ్యూస్ చేసుకోని కూడా తాగవచ్చు.
పుచ్చకాయ జ్యూస్...
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కేవలం 100 గ్రాముల పుచ్చకాయలో 30 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ఇది తీసుకుంటే డీ హైడ్రేషన్ సమస్య ఉండదు. కొవ్వును కూడా త్వరగా కరిగిస్తుంది.
ఆరెంజ్ జ్యూస్...
ఆరెంజ్ పండు తాజాగా ఉన్నప్పుడు జ్యూస్ చేసుకొని తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. దీనిని నెగటివ్ క్యాలరీ ఫ్రూట్ అని అంటారు. ఎందుకంటే.. దీనిలో క్యాలరీ శాతం చాలా తక్కువ. ఇది కూడా కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తుంది.
పైనాపిల్ జ్యూస్..
బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో పైనాపిల్ కీలక పాత్ర పో షిస్తుంది. ప్రస్తుత కాలంలో బెల్లీ ప్యాట్ తో చాలా మంది బాధపడుతున్నారు. ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా తీసుకుంటే కొవ్వును కరిగించవచ్చు.