ఊబకాయానికి పరిష్కారం: జంక్ పుడ్ ఊసే ఉండొద్దు.. కూరగాయలతోనే సరైన భోజనం

 |  First Published Jul 29, 2018, 1:03 PM IST

మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా? అయితే జంక్ ఫుడ్, అర్ధరాత్రి అల్పాహారం తీసుకునే అలవాటుకు దూరం కావాలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.


న్యూఢిల్లీ: మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా? అయితే జంక్ ఫుడ్, అర్ధరాత్రి అల్పాహారం తీసుకునే అలవాటుకు దూరం కావాలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. జంక్‌ఫుడ్, అర్ధరాత్రి అల్పాహారం తీసుకునే అలవాట్లకు దూరం కావడానికి పది మార్గాలు ఉన్నాయి. వాటిని పరిశీలిద్దాం. 

మీరు నిరంతరం కఠినంగా భోజన అలవాట్లు పాటిస్తూ నిరంతరం ఎక్సర్‌సైజ్‌లు పాటించాల్సి ఉంటుంది. కానీ కొన్ని రోజుల పాటు మోతాదును మించి భోజనం తినే అలవాటుకు తిలోదకాలు ఇస్తేనే మీ ఊబకాయం తగ్గాలన్న ప్రణాళికలు అమలులోకి వస్తాయని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రతి రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత అల్పాహారం తీసుకునే అలవాటు ఉన్నవారి బరువును నియంత్రించడం అంత తేలికైన పనేం కాదు. సుదీర్ఘ కాలం పాటు సంత్రుప్తికరమైన పద్ధతిలో ఆహారం తీసుకోవాలని పౌష్టికాహార నిపుణలు చెబుతున్నారు. 

Latest Videos

undefined

మీరు మీ ఆకలి వేదన గురించి ఊహించడం కష్ట సాధ్యం. ఆరోగ్య కరమైన అల్పహారాన్ని భోజనంగా తీసుకునేందుకు సిద్ధం కావడంతోపాటు ప్యాకెట్లలో కరరకరలాడే అల్పాహారం కోసం వెంపర్లాడొద్దని పౌష్టికాహార నిపుణుల సూచన.  గింజలు, డ్రైఫ్రూట్స్, క్యారట్లు, మొలకెత్తిన గింజలు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. ఆబగా జంక్ ఫుడ్‌ తినడానికి బదులు తాగునీరు తాగడం బేషైన పని అని చెబుతున్నారు. 

రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగితే మంచిదని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. మంచినీటితోపాటు మజ్జిగ, నిమ్మరసం కూడా కలిపి తాగితే మరింత మంచిదని పేర్కొంటున్నారు. ఒకవేళ మీరు పూర్తిగా జంక్‌ఫుడ్‌కు దూరమైతే ఆ కోరిక నిన్ను నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. దానికి బదులు నీకు ఇష్టమైన అల్పాహారం తీసుకోవడం మేలు. మీ  శరీరానికి ఏమాత్రం ముప్పు ఉండబోదని నిపుణుల మాట. 

అల్ఫాహారం భారీగా తీసుకోవడంతోపాటు అందులో ఫీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. విచక్షణారహితంగా మీరు అల్పాహారం తీసుకోవడం నుంచి నివారిస్తుంది. ఓట్స్, త్రుణ ధాన్యాలు, ఊకతో కూడిన ఆహార పదార్థాలు ఉండేలా చూడాలి. కాయగూరలు, నట్స్, కోడిగుడ్లు, కోడిమాంసం నుంచి వచ్చే ప్రోటీన్ల వల్ల మీరు సుదీర్ఘకాలం శక్తిమంతులుగా ఉండేలా చేస్తుంది. 

ఒంటరిగా భోజనం తీసుకోవడానికి వెళుతున్నప్పుడు కొన్నిసార్లు ప్రేరణకు దూరం కావాల్సి ఉంటుంది. దానికి బదులు సహచరులు, స్నేహితులు, జీవిత భాగస్వాములతో కలిసి భోజనం చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే భోజనంలో ప్రతి అంశం అదుపులో ఉంటుందని పౌష్టికాహార నిపుణుల మాట. 

మీ భోజనం గురించి మీరు తప్పనిసరిగా ప్రణాళిక అమలు చేయాలి. జంక్‌ఫుడ్ తక్కువగా రూపొందిస్తే మంచిది. దానికి బదులు రోజంతా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినడమే మేలన్న అభిప్రాయం వినిపిస్తున్నది. మీరేం తినాలన్న అంశంపై ఒత్తిడి కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. 

అలవాట్లలో మార్పుల వల్ల జంక్‌ఫుడ్‌పై మీ మూడ్ ప్రభావం చూపుతుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జంక్ ఫుండ్ తినడానికి బదులు వాకింగ్ బెటరని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. మెదడులో ఎటువంటి దూరాలోచన లేకుండా ముందుకెళ్లాలని అప్పుడే జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండగలరని అంటున్నారు. మీ కోరికలపై ఆహారపు అలవాట్లు ప్రభావితం చేస్తాయి. భోజనం చేస్తున్న పదార్థాలను బాగా నమలాలని సూచిస్తున్నారు. జంక్ ఫుడ్ తక్కువగా తినాలని సూచిస్తున్నారు.
 

click me!