ఉప్పును రుచి కోసమే కాదు.. ఇలా కూడా వాడొచ్చు...

By AN Telugu  |  First Published Oct 13, 2021, 2:14 PM IST

అయితే salt ను కేవలం వంటల్లోనే కాకుండా.. ఇతర రకాల ప్రయోజనాలకూ వాడతారు. కొన్నిసార్లు అది చాలా ఆశ్యర్యకరంగా అనిపిస్తుంది. అవేంటో చూడండి.. 


ఉప్పులేని కూర రుచీ, పచీ ఉండదు. ఉప్పు మనవంటకాలను రుచితో పాటు.. శరీరానికీ మంచిది. తగిన మోతాదులో తీసుకుంటే దీనివల్ల అన్నీ లాభాలే. వంటల్లో ఉప్పును చేర్చడం వల్ల వేగంగా వంట చేయడానికే కాకుండా, పోషకాలను తగినంత మొత్తంలో అందించడం ద్వారా అయోడిన్ లోపాన్ని నివారిస్తుంది. 

అయితే salt ను కేవలం వంటల్లోనే కాకుండా.. ఇతర రకాల ప్రయోజనాలకూ వాడతారు. కొన్నిసార్లు అది చాలా ఆశ్యర్యకరంగా అనిపిస్తుంది. అవేంటో చూడండి.. 

Latest Videos

స్నానం స్క్రబ్ : ఉప్పుతో natural bathing scrubను తయారుచేసుకోవచ్చు. దీనివల్ల స్నానం చేసిన తరువాత ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలంటే.. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి... దీంట్లో 1 కప్పు సముద్ర ఉప్పు, 1 కప్పు ఆలివ్ నూనె, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 1/2 స్పూన్ పిప్పరమెంటు లేదా టీ ట్రీ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నారింజ/నిమ్మ రసాన్ని కలపాలి. coarse mixture కోసం ఈ పదార్థాలన్నింటినీ ఒక చెంచాతో బాగా కలపండి. తరువాత గ్లాస్ జార్ లోకి తీసిపెట్టుకుని.. స్నానం చేసేప్పుడు ఒక చెంచాడు బాత్ స్క్రబ్ గా వాడొచ్చు.  

గుడ్డు తాజాదనాన్ని కనిపెట్టొచ్చు : గుడ్లను ఉప్పునీటిలో వేయడం ద్వారా వాటి తాజాదనాన్ని తెలుసుకోవచ్చని మీకు తెలుసా? ఈ ప్రయోగం చేయడానికి, మీకు ఒక తాజా గుడ్డు, మరొక stale egg కావాలి. ఇప్పుడు రెండు గాజు గ్లాసుల్లో నీరు తీసుకుని, ఈ రెండిట్లోనూ ½ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. తరువాత తాజా గుడ్డును ఒక గ్లాసులోకి, పాడైన గుడ్డును మరో గ్లాస్‌లో వేయాలి. తాజా గుడ్డు మునిగి నీటి అడుగుకు చేరుతుంది. అదే పాడైపోయిన గుడ్డు నీటిపైన తేలుతుంది. ఈ చిట్కాతో మీరు తినే గుడ్లు తాజాగా ఉన్నాయా లేదా అని ఈజీగా కనిపెట్టొచ్చు. 

గొంతు దురదకు : దురద లేదా గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఉప్పు నీటితో గార్గిల్ చేయడం ద్వారా మీ గొంతును తక్షణమే ఉపశమనం పొందొచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకోవాలి. నీరు చాలా వేడిగా లేదా చల్లగా లేవని నిర్ధారించుకోవాలి. ఈ నీటిలో ¼ స్పూన్ ఉప్పు వేసి మిక్స్ కలపాలి. దీనికి కావాలంటే చిటికెడు పసుపు కూడా కలపొచ్చు, ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఆ తరువాత నీటిని ఒక సిప్ చేసి  కొన్ని సెకన్ల పాటు gargle చేసి, ఆపై ఉమ్మేయాలి. గొంతునొప్పి, దురదలనుంచి తొందరగా ఉపశమనం కావాలంటే.. రోజుకు 2-3 సార్లు చేయాలి. 

బ్యూటీ బ్లెండర్లను శుభ్రం చేయడానికి... : మురికిగా మారిన బ్యూటీ బ్లెండర్‌ను ఉప్పుతో క్షణంలో శుభ్రం చేయవచ్చు. దీనికోసం గిన్నెలో నీరు తీసుకుని దానికి 1 స్పూన్ ఉప్పు కలపాలి. బ్యూటీ బ్లెండర్‌లను నీటిలో ముంచి, గిన్నెని మైక్రోవేవ్‌లో 1 నిమిషం పాటు స్లైడ్ చేయాలి. ఇప్పుడు గిన్నె తీసి వాటిని 10-15 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు బ్లెండర్లను బయటకు తీసి, నీటిలో కడగడం ద్వారా మచ్చలేని బ్లెండర్లు రెడీ అవుతాయి. 

మూసుకుపోయిన సింక్ కోసం.. : clogged sink తరచుగా ఇంట్లో కనిపించే సమస్యే. సింకులో చెత్తాచెదారం అడ్డుపడి నీళ్లు పోకపోవడం.. దాంతో వచ్చే చికాకులు, ఇబ్బందులు చాలా విసుగ్గా ఉంటాయి. దీని పరిష్కారానికి ఉప్పు, వేడి నీరు అవసరం. సింక్ డ్రెయిన్ మీద 2 టేబుల్ స్పూన్ల ఉప్పు చల్లి, దానిపై 2-3 కప్పుల వేడినీరు పోయాలి. 10 నిమిషాలు సింక్‌ను అలా వదిలేయాలి. 

పురుగుల్ని తరిమికొట్టడానికి.. : earthworms ను ఇంట్లోకి రాకుండా చేయడానికి ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. ఇంటి గుమ్మ ముందు 3-4 టేబుల్‌స్పూన్ల ఉప్పుతో రేఖలా గీయడం వల్ల ఉప్పును వానపాములు రాకుండా ఉంటాయి. 

నిండు గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఏ ఆహారం తీసుకోకూడదు?
 

click me!