పిల్లలను టవీ చూడొద్దు అంటూ ఒక్కసారిగా వారిని కట్టడి చేయకూడదు. అలా చేస్తే.. ఇంకా మొండిగా తయారౌతారు. కాబట్టి మెళ్లగా.. వారు టీవీ చూసే సమయాన్ని తగ్గించుకుంటూ రావాలి.
ప్రస్తుత కాలంలో టీవీలు, స్మార్ట్ ఫోన్లు నిత్యవసర వస్తువులుగా మారిపోయాయి. ఈ రెండూ లేని ఇల్లు లేదు అనడంలో అతిశయోక్తిలేదు. ఇక ఇంట్లో టీవీ ఉంటే.. పిల్లలు వాటికి అలవాటు పడకుండా ఉంటారా..? దానికి తోడు పిల్లలకు నచ్చే ఎన్నోరకాల ప్రోగ్రామ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇంకేముంది.. పిల్లలు అన్నం తినాలన్నా.. అల్లరి చేయకుండా ఉండాలన్నా.. చెప్పిన మాట వినాలన్నా.. అన్నింటికీ టీవీ, స్మార్ట్ ఫోన్లు పరిష్కార మార్గాలు మారిపోయాయి. వాళ్లకు నచ్చినవి చూడనిస్తే.. కుదురుగా ఉంటారు లేకపోతే ఏడ్చేస్తారనే భావనతో తల్లిదండ్రులు కూడా వారి ఇష్టానికి వదిలేస్తున్నారు.
కానీ.. ఇలా చేయడం వల్ల పిల్లలకు చాలా సమస్యలు ఎదురౌతాయి. బద్దకంగా తయారౌతారు. కళ్లు త్వరగా అలిసిపోతాయి. నిద్ర తగ్గిపోతుంది. చదువుల్లో వెనకపడిపోతారు. మానసికంగా, శారీరకంగా, సామాజికంగా చాలా నష్టపోతారు. మరి దీనికి పరిష్కార మార్గమే లేదా అంటే.. ఉందంటున్నారు నిపుణులు.
పిల్లలతో టీవీ చూడటం మానిపించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం...
పిల్లలను టవీ చూడొద్దు అంటూ ఒక్కసారిగా వారిని కట్టడి చేయకూడదు. అలా చేస్తే.. ఇంకా మొండిగా తయారౌతారు. కాబట్టి మెళ్లగా.. వారు టీవీ చూసే సమయాన్ని తగ్గించుకుంటూ రావాలి.
టీవీ చూసే సమయాన్ని తగ్గించి.. వాళ్లని వేరేవాటితో డైవర్ట్ చేయాలి. బొమ్మలు వేయడం, కథల పుస్తకాలు చదివించడం, ఆటలు ఆడించడం, సంగీతం, స్విమ్మింగ్ ఇలా ఏదో ఒక యాక్టివిటీ వాళ్లకి అలవాటు చేయాలి.
వీకెండ్స్ లో పిల్లలను కచ్చితంగా బయటకు తీసుకువెళ్లాలి. మరీ చిన్నపిల్లలు అయితే.. ప్లే స్కూళ్లలో చేర్పించాలి. టీవీ చూడటం తగ్గిస్తే.. గిఫ్ట్స్ ఇస్తానని చెప్పాలి. వాళ్లు మీరు చెప్పినట్లుగా వింటూ టీవీ చూడటం ఆపేస్తే.. చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వాలి. ఇలా చేస్తే.. క్రమంగా వాళ్లు.. టీవీ చూసే సమయం తగ్గిపోతుంది.