డెలవరీ సమయంలో నొప్పులు రాకుండా ఉండాలంటే..

By ramya neerukondaFirst Published Nov 23, 2018, 4:39 PM IST
Highlights

కడుపుతో ఉన్న సమయంలో మహిళలు ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

మహిళలు..  బిడ్డకు జన్మనివ్వడం అంటే.. మరో జన్మ ఎత్తినట్టే. డెలివరీ సమయంలో ఎంతో ప్రసవ వేదన పడితే తప్ప.. కడపులోని బిడ్డ బయటకు రాదు. ఆ క్షణం ఏ తల్లి అయినా.. నొప్పి భరించాల్సిందే. ఈ ప్రసవ వేదన తగ్గడానికి మార్గమే లేదా అంటే.. కచ్చితంగా ఉంది అంటున్నారు నిపుణులు.

కడుపుతో ఉన్న సమయంలో మహిళలు ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిపై మాడ్రిడ్ టెక్నికల్ యూనివర్శిటీ విద్యార్థులు పరిశోధనలు కూడా జరిపారట. వారి పరిశోధన ప్రకారం.. గర్బిణీలు వ్యాయామం చేస్తే.. డెలివరీ సమయంలో ఎక్కువ సేపు ప్రసవ వేదన పడాల్సి ఉండదట. 

డెలివరీ కాస్త సులభంగా నొప్పులు మొదలైన కొద్ది సేపటికే జరిగిపోతుందని చెబుతున్నారు. దాదాపు 500మంది మహిళలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని వారు చెబుతున్నారు. 500మందిలో సగం మంది వారానికి మూడుసార్లు క్రమంగా వ్యాయామం చేశారట. 

అలా వ్యాయామం చేసిన మహిళలు నొప్పులు పడే సమయం చాలా తక్కువగా ఉందట. అంతేకాదు బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉందని, డెలివరీ చాలా సులభంగా జరిగిందని వారు చెబుతున్నారు. అంతేకాదు.. గర్భిణీలుగా ఉన్న మహిళలు వ్యాయామం చేస్తే.. డెలివరీ తర్వాత వారి శరీరాకృతిలో ఎలాంటి మార్పులు లేకుండా.. మునుపటిలాగే అందంగా కనిపించారట. 

click me!