చనిపోయిన మహిళ గర్భసంచి.. మరో మహిళకు

By ramya neerukonda  |  First Published Dec 5, 2018, 3:03 PM IST

చనిపోయిన మహిళ గర్భసంచిని.. మరో మహిళకు అమర్చి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు బ్రెజిల్ వైద్యులు.  



చనిపోయిన మహిళ గర్భసంచిని.. మరో మహిళకు అమర్చి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు బ్రెజిల్ వైద్యులు.  జన్మలో తనకు పిల్లలు పుట్టరు అనుకున్న మహిళ ఇప్పుడు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంది. వైద్య చరిత్రలోనే ఇది అరుదైన ఘటనగా వైద్యులు భావిస్తున్నారు.ఈ కథనాన్ని ‘ ద లాన్ సెట్ మెడికల్ జర్నల్ ప్రచురించింది’

పూర్తి వివరాల్లోకి వెళితే... జన్యు లోపం కారణంగా.. ఓ మహిళకు పుట్టుకుతోనే గర్భసంచి లేదు. 4500మందిలో ఒకరికి అరుదుగా వచ్చే మేయర్ రాకిటాన్స్ కీ కస్టర్ హాసర్ అనే సిండ్రోమ్ కారణంగా.. ఆమె తల్లి అయ్యే అవకాశం లేకుండా పోయింది. అయితే... వివాహానంతరం ఆ మహిళ వైద్యులను సంప్రదించగా.. గర్భాశయ మార్పిడి ద్వారా సాధ్యమౌతుందని చెప్పారు. 

Latest Videos

అందుకు ఆమె అంగీకరించడంతో.. 2016లో చనిపోయిన ఓ మహిళ గర్భశాయన్ని ఈ మహిళకు అమర్చారు. ఆపరేషన్‌ విజయవంతం కావడంతో ఆమెకు రుతుస్రావం మొదలైంది. ఈ క్రమంలో 2017లో గర్భం దాల్చిన ఆమె అదే ఏడాది డిసెంబరు 15న ఆడ శిశువుకు(సిజేరియన్‌ సెక్షన్‌) జన్మనిచ్చారు. పుట్టిన సమయంలో రెండున్నర కిలోల బరువు ఉన్న ఆ శిశువు ప్రస్తుతం ఏడున్నర కిలోల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉంది.

అయితే.. ఇప్పటివరకు చాలా మందికి గర్భాశయ మార్పిడి చేసినా.. చాలా కొద్ది మందిలోనే అది సక్సెస్ అయ్యింది. తొలిసారి ఓ చనిపోయిన మహిళ గర్భాశయాన్ని మార్చి ఆపరేషన్ సక్సెస్ చేయడం చాలా అద్భుతమని వైద్యులు చెబుతున్నారు. 

click me!