గాయం చిన్నదైనా, పెద్దదైనా దాన్ని నిర్లక్ష్యం చేయద్దు. రెండింటినీ సమాన జాగ్రత్తలతో చూసుకోవాలి. గాయం అనగానే రక్తం కారడమే కాదు, గీరుకుపోవడం, కమలడం, బొడిపె రావడం లాంటివి కూడా గాయాల కిందికే వస్తాయి. ఒక్కసారి చిన్నగా అయిన గాయం సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల రోజురోజుకూ పెరిగే అవకాశం ఉంది. అదే పెద్ద గాయమైన సరైన సంరక్షణ ఉంటే తొందరగా తగ్గే అవకాశాలూ ఉన్నాయి. అందుకే.. గాయం ఎలాంటిదైనా గాయం అయిన వెంటనే తీసుకునే జాగ్రత్తలు ముఖ్యపాత్ర వహిస్తాయి.
రోజువారీ పనుల్లో గాయాలు కావడం మామూలు విషయమే. ఇంటిపనులు, వంటపనులు, గార్డెనింగ్, ఐరెనింగ్ ఇలా ఏపనిలోనైనా గాయాలయ్యే అవకాశం లేకపోలేదు. కొన్నిసార్లు ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చున్నా ఏదో గీరుకుపోయే, రాసుకుపోయే గాయాలవుతుంటాయి.
గాయం చిన్నదైనా, పెద్దదైనా దాన్ని నిర్లక్ష్యం చేయద్దు. రెండింటినీ సమాన జాగ్రత్తలతో చూసుకోవాలి. గాయం అనగానే రక్తం కారడమే కాదు, గీరుకుపోవడం, కమలడం, బొడిపె రావడం లాంటివి కూడా గాయాల కిందికే వస్తాయి. ఒక్కసారి చిన్నగా అయిన గాయం సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల రోజురోజుకూ పెరిగే అవకాశం ఉంది. అదే పెద్ద గాయమైన సరైన సంరక్షణ ఉంటే తొందరగా తగ్గే అవకాశాలూ ఉన్నాయి. అందుకే.. గాయం ఎలాంటిదైనా గాయం అయిన వెంటనే తీసుకునే జాగ్రత్తలు ముఖ్యపాత్ర వహిస్తాయి.
undefined
దెబ్బ తగలగానే వెంటనే చికిత్స
దెబ్బ తగలాగే.. దెబ్బతిన్న ప్రాంతం బాహ్య వాతావరణానికి గురవుతుంది. చర్మం అంతర్గత, సున్నితమైన కణజాలం దీన్ని తట్టుకోలేదు. అందుకే దీనికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. గాయానికి సరిగా చికిత్స చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ని క్లియర్ చేసి, రికవరీ వేగాన్ని కూడా పెంచుతుంది. కోతలు, గీతలు, చిన్న కాలిన గాయాల వంటి వాటికి కొన్ని టిప్స్ తో ఇంట్లో సులభంగా చికిత్స చేయవచ్చు. ఇక పెద్ద పెద్ద గాయాలైన పడిపోయి తీవ్రంగా దెబ్బతగిలించుకోవడం.. కాలి బొబ్బలెక్కడం, చర్మం మొత్తం కోతలు పడడం లాంటి పెద్ద గాయాలకు, వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోవడం మంచిది.
బైటికి కనిపించే గాయానికి చికిత్స
బైటికి కనిపించే చిన్న చిన్న గాయాలకు చికిత్స చేయడం చాలా సులభం. దీనికోసం ఎప్పుడూ ఇంట్లో డిసినిఫెక్టెంట్, దూది, యాంటిసెప్టిక్, బ్యాండేజ్ లు మీ first aid kit లో ఉండేలా చూసుకోండి.
ఇక open wound కు ఎలా చికిత్స చేయాలో చూడండి..
చేతులు కడుక్కోండి : గాయాలకు చికిత్స చేసేముందు.. చేతులు శుభ్రంగా కడుక్కోండి. చేతులకు ఉంగరాలవంటి ఆభరణాలుంటే తీసేయండి.
ఒత్తిడి పెట్టండి : గాయం నుంచి రక్తస్రావం అవుతుంటే, మెల్లాగా ఆ ప్రాంతాన్ని పైకి లేపి.. వాపు రాకుండా ఉండడానికి.. మృదువుగా ఒత్తాలి.
గాయాన్ని కడగాలి : రక్తస్రావం ఆగిపోయిన తర్వాత గాయాన్ని నీళ్లు, సెలైన్ ద్రావణంతో కడగాలి. ఇన్ ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి గాయాన్ని రన్నింగ్ టాప్ కింద ఉంచాలి. సబ్బుతో గాయాన్ని కడగాలనుకుంటే.. ముందుగా గాయం చుట్టూ ఉన్న చర్మాన్ని మాత్రమే కడగాలి.
తీసుకోవాల్సి జాగ్రత్తలు...
గాయంలో మట్టి రేణువులు, కర్ర పేడు, దుమ్ము లాంటివి లోపల చిక్కుకుపోయాయేమో గమనించాలి. వీటిని తొలగించడానికి గాయాన్ని నల్లా కింద పెట్టి కడగాలి. లేకపోతే ఇవి ఇన్ఫెక్షన్ కి దారి తీస్తాయి. ఆ తరువాత సెలైన్ ద్రావణంతో శుభ్రం చేసి ట్వీజర్‌లను ఉపయోగించడం ద్వారా ఆ దుమ్మూధూళిని జాగ్రత్తగా తొలగించాలి.
యాంటీబయాటిక్‌ను రాయాలి : గాయం ఉపరితలం తేమగా ఉండటానికి యాంటీబయాటిక్ లేదా పెట్రోలియం జెల్లీ లను రాయాలి.
గాయాన్ని కవర్ చేయాలి : గాయాన్ని కవర్ చేయడానికి బ్యాండ్-ఎయిడ్ లేదా కట్టు కట్టొచ్చు.
కాలక్రమంలో చిన్నగాయం ఈజీగా తగ్గిపోతుంది. గాయానికి బ్యాండేజ్ కడితే మాత్రం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. పరిస్థితులు దిగజారుతున్నాయనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలి.
డ్రెస్సింగ్ మార్చండి : రోజుకు కనీసం ఒక్కసారైనా డ్రెస్సింగ్ మార్చండి. కట్టు తడిగా లేదా మురికిగా మారినప్పుడు దానిని మార్చాలి. ఆ ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేసి, శుభ్రమైన వస్త్రంతో మెల్లిగా అద్ది.. ఆరబెట్టండి, యాంటీబయాటిక్స్ అప్లై చేసి, ఆపై మళ్లీ కట్టు వేయాలి.
గాయాలు లోతుగా అయితే ఎందుకైనా మంచిది ఒక టెటానస్ ఇంజెక్షన్ తీయించుకోవాలి. చర్మంపై లేదా గాయం దగ్గర ఇన్ఫెక్షన్ సంకేతాలు ఏవైనా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
కాలిన గాయాలకు చికిత్స : ఫస్ట్-డిగ్రీ బర్న్ చికిత్స.. పడిన, కోసుకుపోయిన దెబ్బలకు చికిత్స కంటే భిన్నంగా ఉంటుంది. కాలిన గాయాల విషయంలో మీరు ఆ ప్రాంతంలో నొక్కలేదు. కట్టు కట్టుకోలేరు. ఇవి మీ మంటను మరింత తీవ్రతరం చేస్తాయి.
అందుకే.. ముందుగా, మీ బర్న్ ఉన్న ప్రదేశంలో 20 నిమిషాల పాటు చల్లటి నీరు పోయండి, తర్వాత సబ్బు, నీటితో కడగండి. ఆ తర్వాత నొప్పి, వాపు నుండి ఉపశమనం కోసం కూల్ కంప్రెసర్, లేదా శుభ్రమైన తడిబట్టను పెట్టొచ్చు. ప్రభావిత ప్రాంతానికి కలబంద లేదా బర్న్ క్రీమ్ రాయవచ్చు. కాలిన గాయాలు ఎండకు ఎక్స్ పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. మీ బర్న్ ప్రత్యక్ష సూర్యకాంతికి గురికాకుండా ఉండండి.
డాక్టర్ దగ్గరికి ఎప్పుడెళ్లాలి?
గాయాలు అయిన తరువాత రోజురోజుకు వాటిలో తగ్గుదల కనిపించాలి. అలా కాకుండా మీ గాయాలు పెద్దవవుతున్నట్టనిపిస్తే.. వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి.
దీంతో పాటు.. గాయాల చుట్టూ..
- ఎరుపు లేదా వాపు
- తీవ్రమైన నొప్పి
- గాయం నుంచి రసి లేదా రక్తం కారుతుంటే
- జ్వరం లేదా చలి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి.
also read ఇంట్లో పెంచుకునే ముఖ్యమైన ఔషధ మొక్కలు ఏంటో తెలుసా?
మాస్క్ పెట్టుకుంటే తల నొప్పి వస్తోందా..?