స్ట్రెస్ ఎక్కువైతే ఈ రోగాలొస్తయ్ జాగ్రత్త..

By Mahesh RajamoniFirst Published Sep 12, 2022, 2:14 PM IST
Highlights

స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కాళ్లు చేతులు చల్లబడుతాయి. నోరు ఎండిపోతుంది. కండరాల నొప్పులు, తలనొప్పి, నిద్రపట్టకపోవడం, దవడ బిగుసుకుపోవడం, ఛాతిలో నొప్పి వంటి కొన్ని శారీరక లక్షణాలు కనిపిస్తాయి. 
 

ఒత్తిడి ఎన్నో కారణాల వల్ల వస్తుంది. ఇక ఈ స్ట్రెస్ ఎన్నో మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడితో బాధపడుతున్నట్టు వాళ్లకు  తెలియకపోయినా.. ఇతరులు మాత్రం ఈజీగా గుర్తిస్తారు. పని ఎక్కువైనప్పుడు, భాగస్వామితో గొడవ జరిగేటప్పుడు, ఆర్థిక విషయాల్లో మీలో ఒత్తిడి లక్షణాలు కనిపిస్తారు. ఒత్తిడి ఎప్పుడో ఒకసారి వస్తే ఏం పర్లేదు కానీ.. ఎప్పుడూ దీనితో బాధపడితే మాత్రం ఎన్నో దార్ఘకాలిక సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఒత్తిడి మిమ్మల్ని మానసికంగానే కాదు.. శరీరకంగా కూడా దెబ్బతీస్తుంది. ఇంతకు మీరు స్ట్రెస్ తో బాధపడుతున్నారని ఎలాంటి లక్షణాలు చెబుతాయో తెలుసుకుందాం పదండి. 

స్ట్రెస్ వల్ల రక్తపోటు దారుణంగా పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. శరీరం బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. ఇక ఈ సమయంలో లోతైన శ్వాసను తీసుకోవాలి. అయితే స్ట్రెస్ వల్ల ప్రతి ఒక్కరూ ఇలా బిహేవ్ చేయరు. కొంతమంది ఏ విషయాన్నైనా లైట్ తీసుకుంటారు. కొంతమంది మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటారు. విషయాలను కఠినమైనవిగా తీసుకున్నవారే ఎక్కువగా స్ట్రెస్ కు గురవుతుంటారు. 

స్ట్రెస్ లక్షణాలు

స్ట్రెస్ వల్ల మానసిక ఆరోగ్యంతో పాటుగా, శరీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, ఒత్తిడి వల్ల మీ ఆలోచనలో మార్పులొస్తాయి. ఏకాగ్రత కోల్పోతారు. పనిపై శ్రద్ధ ఉండదు. పనిచేయలేకపోతుంటారు.  మీ బ్రెయిన్ విశ్రాంతి లేకుండా ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా విసుగ్గానే ఉంటారు. ఊరికే చిరాకు పడతారు. ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడరు. ఆందోళనకు గురవుతుంటారు. తమను తామే తక్కువగా చేసుకుంటారు. డిప్రెషన్ కు లోనవుతారు. ఎందరున్నా లోన్లీ గానే ఫీలవుతారు. అలాగే బాడీ పెయిన్స్ ఉంటాయి. మజిల్స్ కూడా నొప్పిగా ఉంటాయి. హెడేక్ వస్తుంది. తెల్లవార్లూ నిద్రుండదు. కాళ్లు, చేతులు చల్లబడతాయి. ఊరికూరికే నోరు ఎండిపోతుంది. ఛాతిలో నొప్పి కలుగుతుంది. సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. చేతులు వణుకుుతాయి. సెక్స్ చేయాలన్నా కోరికలు కూడా పోతాయి. ఏది మంచి ఏది చెడు అన్న విషయాలను గుర్తించలేకపోతారు. ఆలోచనలు నిలకడగా ఉండకపోవడం వంటి లక్షణాలు కనిస్తాయి.

బాగా స్ట్రెస్ కు గురయ్యే వారు కాళ్లను ఎక్కువగా ఊపుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే గోర్లను అదే పనిగా కొరుకేస్తూ ఉంటారట. వీళ్లు మొత్తమే తినరు లేదా ఎక్కువగా తినేస్తుంటారు. చెప్పిన విషయాలను కూడా కొన్ని సందర్బాల్లో మర్చిపోతుంటారు. 

ఈ స్ట్రెస్ ఎక్కువ రోజులు అలాగే కొనసాగితే.. గుండెపోటుతో పాటుగా ఇతర హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అధిక రక్తపోటు బారిన కూడా పడతారు. అలాగే డిప్రెషన్, షుగర్ వ్యాధి. యాంగ్జైటీ, ఊబకాయం, స్కిన్ ప్రాబ్లమ్స్, లైంగిక సమస్యలు, సెక్స్ పై కోరికలు తగ్గడం, పల్స్ రేటు మారడం, మతిమరుపు, అల్సర్,  ఎప్పుడూ తినాలనిపించడం వంటి సమస్యలు వస్తాయి. 

click me!